New CDS: కొత్త సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియామకం.. 40 ఏళ్లుగా దేశ సేవలో..

|

Sep 28, 2022 | 8:01 PM

భారత ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా నియమించింది..

New CDS: కొత్త సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియామకం.. 40 ఏళ్లుగా దేశ సేవలో..
Lt Gen Anil Chauhan
Follow us on

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా రిటైర్ట్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ను నియమించారు. దివంగత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ స్థానంలో అనిల్‌ చౌహాన్‌ను కేంద్రం నియమించింది. సైన్యం 40 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు అనిల్‌ చౌహాన్‌. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు ఆయన గతంలో మిలటరీ అడ్వయిజర్‌గా పనిచేశారు. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేస్తారు.

40 ఏళ్ల పాటు దేశ సేవ చౌహాన్..

జనరల్ అనిల్ చౌహాన్ గూర్ఖా రైఫిల్‌తో సైన్యంలోకి ప్రవేశించారు. అనిల్ సుమారు 40 సంవత్సరాలుగా దేశ సైన్యంలో ఉన్నారు. ఆ తర్వాత గత సంవత్సరం పదవీ విరమణ చేశారు. 1961లో జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌ల పూర్వ విద్యార్థి.

అతను 1981లో భారత సైన్యం యొక్క 11 గూర్ఖా రైఫిల్స్‌లో నియమించబడ్డారు. మేజర్ జనరల్‌గా, అనిల్ చౌహాన్ నార్తర్న్ కమాండ్‌లోని క్లిష్టమైన బారాములా సెక్టార్‌లో పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్ జనరల్‌గా అతను నార్త్ ఈస్ట్‌లో ఒక కార్ప్స్‌కి నాయకత్వం వహించారు.

అనిల్ చౌహాన్ సెప్టెంబరు 2019లో తూర్పు కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా మారారు. మే 2021లో సర్వీస్ నుండి పదవీ విరమణ చేసే వరకు ఆయన బాధ్యతలు నిర్వహించారు.

అతని విశిష్ట సేవ కోసం, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)కు పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేన పతకం మరియు విశిష్ట సేవా పతకం లభించాయి.

ఈశాన్య భారత్‌తోపాటు J&Kలో కార్యకలాపాలు

నార్తర్న్ కమాండ్‌లో మేజర్ జనరల్‌గా పని చేశారు. క్లిష్టమైన బారాములా సెక్టార్‌లో పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. అతను మేజర్ జనరల్‌గా నార్త్-ఈస్ట్‌లో ఒక కార్ప్స్‌కి కూడా నాయకత్వం వహించారు. తదనంతరం, అతను సెప్టెంబర్ 2019లో తూర్పు కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ బాధ్యతను స్వీకరించారు. మే 2021లో సర్వీస్ నుండి పదవీ విరమణ చేసే వరకు ఆ పదవిలో కొనసాగారు.

ఈ కమాండ్ అపాయింట్‌మెంట్‌లతో పాటు అధికారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌తో సహా ముఖ్యమైన సిబ్బంది నియామకాలను నిర్వహించారు. దీనికి ముందు అంగోలాలో ఐక్యరాజ్యసమితి మిషన్‌లో ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. ఆ అధికారి 31 మే 2021న భారత సైన్యం నుంచి పదవీ విరమణ పొందారు . సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అతను జాతీయ భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలకు తన వంతు సహకారం అందించారు.

చౌహాన్‌ను వరించిన విశిష్ట పతకాలు ఇవే..

లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (విశ్రాంత) పరమ విశిష్ట సేవా పతకం (PVSM), ఉత్తమ్ యుద్ధ సేవా పతకం (UYSM), అతి విశిష్ట సేవా పతకం (AVSM), సేన పతకం (SM), విశిష్ట సేవా పతకం (VSM),  సైన్యంలో అద్భుతమైన సేవలు అందించారు.

చాలా కాలంగా ఆ పోస్టు ఖాళీగా..

మాజీ CDS జనరల్ బిపిన్ రావత్ మరణం తర్వాత ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే పేరు ఖరారు చేయడానికి సమయం పట్టింది. అయితే ఇప్పుడు రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ సీడీఎస్ బిపిన్ రావత్ విమాన ప్రమాదంలో మరణించారు. గతేడాది డిసెంబర్ 8న ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం