
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పన్నుల విభాగంలో కీలకమైన మార్పులు జరిగాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ ( CBDT ) బోర్డులో తెలుగువారికి ప్రాధాన్యం లభించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు-DBDTలో నలుగురు కొత్త సభ్యులను నియమిస్తూ కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) సభ్యులుగా నలుగురు సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారుల నియామకానికి ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు గురువారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన IRS అధికారులకు కొత్త బాధ్యతలను కేంద్రం అప్పగించింది. CBDTలో సభ్యులుగా పంకజ్ కుమార్ మిశ్రా, సంజయ్ బహదూర్, ఎల్. రాజశేఖర్ రెడ్డి, జి. అపర్ణా రావు సభ్యులుగా నియమించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ వీరి పేర్లను ఖరారు చేసింది. తెలుగు వ్యక్తి, సినీయర్ ఐఆర్ఎస్ అధికారి రాజశేఖర్ రెడ్డి కూడా ఈ CBDT బోర్డులో స్థానం లభించడం విశేషం..
Cbdt Members
కొత్తగా నియమితులైన సభ్యులలో అణుశక్తి కమిషన్ సభ్యుడు (ఆర్థిక)గా పనిచేస్తున్న పంకజ్ కుమార్ మిశ్రా, ఢిల్లీలో ఆదాయపు పన్ను (శిక్షణ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ పదవిని నిర్వహించిన సంజయ్ బహదూర్ ఉన్నారు. ఇక తెలుగు వ్యక్తి ఎల్. రాజశేఖర్ రెడ్డి చెన్నై, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు ఆదాయపు పన్ను (TDS) ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జి. అపర్ణ రావు బెంగళూరు, కర్ణాటక, గోవా ప్రాంతాలకు ఆదాయపు పన్ను-1 ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
నియమితులైన నలుగురు కూడా 1989 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఆదాయపు పన్ను) కు చెందినవారు. భారతదేశంలో ప్రత్యక్ష పన్ను చట్టాలను నిర్వహించడానికి బాధ్యత వహించే అత్యున్నత సంస్థ అయిన CBDTలో ఖాళీగా ఉన్న స్థానాలను ఈ నియామకాలు భర్తీ చేస్తాయి. పన్ను వసూలు, పన్ను ఎగవేతను ఎదుర్కోవడం, వివిధ ప్రత్యక్ష పన్ను సంస్కరణలను అమలు చేయడం కోసం విధానాలను రూపొందించడంలో బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది. “ప్రభుత్వం పన్ను సమ్మతిని పెంచడం, పన్ను బేస్‌ను విస్తరించడంపై దృష్టి సారించిన కీలక సమయంలో ఈ నియామకాలు CBDTకి అనుభవ సంపదను తెస్తాయి” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..