IT Jobs: ఐటీ రంగంలో కోటి ఉద్యోగాలు పక్కా.. ఇది కేంద్ర మంత్రి మాట..

|

May 21, 2022 | 7:34 PM

IT Jobs: ఐటీ (IT), దాని అనుబంధ సంస్థల ద్వారా రానున్న రోజుల్లో దేశంలో కోటికిపైగా ఉద్యోగాలు లభించనున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. 2025-26 నాటికి ఆ రంగాల్లో కోటికిపైగా ఉద్యోగాల...

IT Jobs: ఐటీ రంగంలో కోటి ఉద్యోగాలు పక్కా.. ఇది కేంద్ర మంత్రి మాట..
Follow us on

IT Jobs: ఐటీ (IT), దాని అనుబంధ సంస్థల ద్వారా రానున్న రోజుల్లో దేశంలో కోటికిపైగా ఉద్యోగాలు లభించనున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. 2025-26 నాటికి ఆ రంగాల్లో కోటికిపైగా ఉద్యోగాల కల్పన జరగనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌ కాన్ఫిరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐటీ సెక్టార్‌లో 10 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2025-26 నాటికి ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో 400 బిలియన్ల యూఎస్‌ డాలర్ల ఆదాయాన్ని సృష్టించడమే మా లక్ష్యం. ఈ ఏడాది 10 లక్షల కొత్త ఉద్యోగాలతో పాటు రానున్న రోజుల్లో కోటి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నాము. స్టార్టప్‌ కంపెనీల ఏర్పాటు విషయంలో భారత్‌ ముందంజలో ఉంది. గడిచిన మూడేళ్లలో దేశంలో కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులు వచ్చాయి. మూడేళ్లలో భారత్‌లో సుమారు లక్ష స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభమయ్యాయని’ మంత్రి తెలిపారు.

దేశంలో ఏర్పాటు చేసిన మొత్తం స్టార్టప్‌ కంపెనీల్లో 100 యూనికార్న్‌ కావడం విశేషం. రానున్న రోజుల్లో కోటి ఉద్యోగాలతో పాటు స్టార్టప్‌ కంపెనీల ద్వారా మరికొన్ని ఉద్యోగాలు రానున్నాయని మంత్రి తెలిపారు. దేశంలో యూనీకార్న్‌ కంపెనీల విలువ 1 బిలియన్‌ డాలర్లు ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి శనివారం స్మార్ట్‌ మ్యానిఫాక్చరింగ్‌ కంపెటెన్సీ సెంటర్‌ను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..