Central Not Extended:దేశ రాజధాని సరిహద్దుల్లో ఇంటర్నెట్ సర్వీసుల రద్దును పొడిగించలేదని కేంద్రం తెలిపింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దు ప్రాంతాల్లో ఫిబ్రవరి 2 రాత్రి వరకు మాత్రమే ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేసినట్లు హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. రైతు ఉద్యమం నేపథ్యంలో ఈ మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు జనవరి 29 రాత్రి 11 గంటల నుంచి జనవరి 31 రాత్రి 11 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం తొలుత ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత మళ్లీ దీన్ని ఫిబ్రవరి 2 వరకు పొడిగించింది. ప్రజల భద్రత, ప్రజా అత్యవసర పరిస్థితి దృష్ట్యా టెలికాం సేవలను నిలిపివేస్తున్నట్టు అప్పట్లో కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ నుంచి రైతులు ఆందోళన బాట పట్టారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి ఘటనలు తలెత్తకుండా ఇంటర్నెట్ సర్వీసులను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఏవండోయ్ ఇది విన్నారా? తెలుగు మహిళలకు ఇంటర్‌నెట్ అంటే తెలియదట.. మరి ఏం తెలుసు అనుకుంటున్నారా..