మన దేశంలో రోజు రోజుకీ సర్వికల్ కాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. మహిళల్లో కనిపించే గర్భాశయయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవది కాగా భారత్‌లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మహిళలల్లో ఎక్కువ శాతం మరణాలకు కారణం అవుతున్న క్యాన్సర్స్‌లో సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్) ఒకటి. దీన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు అందించనుంది.
ఈ ఏడాది జూన్‌లో తొమ్మిది నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు జాతీయ రోగనిరోధకత కార్యక్రమంలో కేంద్రం HPV వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 9-14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ ను ఫ్రీగా వేయనున్నారు. గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తిని ఆపడానికి HPV వ్యాక్సిన్ కీలకం… 16 కోట్ల డోసులకు ఏప్రిల్లో టెండర్ వెలువడనుంది. దేశంలో ఏటా 35 వేల మంది స్త్రీలు సర్వికల్ క్యాన్సర్ తో మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలికలకు HPV వ్యాక్సిన్లను ఇవ్వడం హర్షణీయమని అంటున్నారు.
అయితే ఇప్పటికే దేశంలోని ప్రతి జిల్లాలో 5 నుంచి 10వ తరగతి వరకు బాలికల సంఖ్యను క్రోడీకరించి ఆ లిస్ట్ ను అందించాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం కోరిన సంగతి తెలిసిందే. అయితే స్త్రీలలో ఎక్కువగా వచ్చే ఈ సర్వికల్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించి సరైన చికిత్స ఇచ్చినట్లు అయితే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..