EPFO: వారెవ్వా.. ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అంటే ఇదికదా.. ఇక డబ్బు విత్‌డ్రా చాలా ఈజీ..!

ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. గత కొద్ది నెలల క్రితమే ఈ నిర్ణయం ప్రకటించగా.. ఎప్పటినుంచి అమల్లోకి తెస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

EPFO: వారెవ్వా.. ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అంటే ఇదికదా.. ఇక డబ్బు విత్‌డ్రా చాలా ఈజీ..!
Epfo

Updated on: Dec 16, 2025 | 4:26 PM

ఈపీఎఫ్ వినియోగదారులకు సులువుగా సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తుంది. పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను ఈజీగా తీసుకునే వెసులుబాటు కల్పించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుని కొత్త పద్దతులను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా ఏటీఎం, యూపీఐ ద్వారా తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులను తీసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నిర్ణయం ప్రకటించి చాలా రోజులైనా ఎప్పటినుంచి అమలు చేస్తారనే దానిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. దీంతో ఉద్యోగులు ఈ సదుపాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఎప్పటినుంచి అమలు చేస్తామనేది ముహూర్తం ఖరారు చేసింది.

అమల్లోకి ఎప్పటినుంచంటే..?

పీఎఫ్ అకౌంట్లోని సొమ్మును ఏటీఎం, యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్ సహాయంతో విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని 2026 మార్చిలోపు అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఈ మేరకు దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించకుండా ఇక నుంచి పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లోని 75 శాతం సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. డబ్బులు నిమిషాల్లోనే తీసుకునేందుకు ఏటీఎం, యూపీఐ సౌకర్యం అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ కొనసాగుతోందని, దీని కోసం సరికొత్త టెక్నాలజీని అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 2026 మార్చిలోగానే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని మాండవీయ పేర్కొన్నారు.

ఏటీఎం ద్వారా ఎలా అంటే..?

పీఎఫ్ అకౌంట్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం ద్వారా ఖాతాదారులు డెబిట్ కార్డుతో పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను సులువుగా విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్రమంత్రి వివరించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే చేపడుతున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే యూఏఎన్ నెంబర్‌తో ఆధార్ లింక్ చేయడం పూర్తయిందని, ఇకపై బ్యాంక్ అకౌంట్‌తో పీఎఫ్ అకౌంట్‌ను లింక్ చేసే ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. ఇక నుంచి అకౌంట్లోని డబ్బులను ఉపంసహరించుకోవడానికి ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని, నిమిషాల్లోనే డెబిట్ కార్డు, యూపీఐ విధానం ద్వారా ఉపసంహరించుకోవచ్చని మాండవీయ తెలిపారు.

25 శాతం మినహాయించి

గతంలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. ఎందుకు విత్ డ్రా చేసుకుంటారనేది ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ సమర్పించాల్సి వచ్చేది. ఆధారాలను ఈపీఎఫ్‌వో అధికారులు పరిశీలించి డబ్బులు అకౌంట్లో జమచేసేవారు. దీనికి రెండు లేదా మూడు రోజుల సమయం పట్టేది. ఇక పీఎఫ్ అకౌంట్‌లోని మొత్తం డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి వీలు పడేది కాదు. కానీ ఇప్పుడు మీ పీఎఫ్ అకౌంట్స్‌లో మినిమం 25 శాతం అమౌంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా సొమ్మును మీరు ఎప్పుడైనా ఏటీఎం లేదా యూపీఐ విధానంలో విత్ డ్రా చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు సెకన్లలోనే పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.