Central Govt Scheme: మీరు పాడి రైతులా?.. అయితే రూ. 5 లక్షలను పొందండి.. పూర్తి వివరాలు మీ కోసం..

|

Aug 02, 2021 | 9:47 AM

Central Govt Scheme: వ్యవసాయం, పశుసంవర్ధక రంగంలో ఉత్తమ ఫలితాలు కనబరుస్తున్న రైతులను ప్రోత్సహించడానికి కేంద్రం..

Central Govt Scheme: మీరు పాడి రైతులా?.. అయితే రూ. 5 లక్షలను పొందండి.. పూర్తి వివరాలు మీ కోసం..
Cows
Follow us on

Central Govt Scheme: వ్యవసాయం, పశుసంవర్ధక రంగంలో ఉత్తమ ఫలితాలు కనబరుస్తున్న రైతులను ప్రోత్సహించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను, అవార్డులను, బహుమతులను ఇస్తున్నాయి. ఈ అవార్డులు రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో వివిధ స్థాయిలలో ఇవ్వబడుతుంది. ఈ నేపథ్యంలోనే.. పశువుల పెంపకందారులను, పాడి రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం సహా మరికొన్ని పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకం కింద సరికొత్త ప్రయోగాలతో పాడి పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించిన రైతులకు భారీ నజరానా అందిస్తారు. వాస్తవానికి రైతులను ప్రోత్సహించడానికి, పాల ఉత్పత్తి రంగంలో పోటీని సృష్టించడానికి ఈ అవార్డును రైతులకు ఇవ్వడం జరుగుతుంది.

అవార్డులు మూడు విభాగాలలో ఇవ్వబడతాయి..
గోరత్న పురస్కార్ యోజన కింద.. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధికై పాటుపడే వారి కోసం మూడు విభాగాలలో అవార్డులు ఇవ్వడం జరుగుతంది. ఈ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. దేశీయ ఆవులు, కృత్రిమ గర్భధారణ టెక్నీషియన్ (AI), పాల సహకార సంఘం, పాల ఉత్పత్తి కంపెనీ, ఉత్తమ పాడి రైతులు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మొత్తం అవార్డులో అందుతుంది
రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద దేశంలోని రైతులకు గోపాల్ రత్న అవార్డు ఇవ్వబడుతుంది. ఈ అవార్డులు మూడు విభాగాలలో ఇవ్వబడతాయి. మొదటి బహుమతిగా ఐదు లక్షల రూపాయలు, రెండవ బహుమతిగా మూడు లక్షల రూపాయలు మరియు మూడవ స్థానానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వబడతాయి.

ఎలా దరఖాస్తు చేయాలి
గోపాల్ రత్న అవార్డు పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ అవార్డు ప్రయోజనాన్ని పొందడానికి దేశంలోని రైతులు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికీ తీసుకోబడుతున్నాయి. దీనికి అర్హత కలిగిన రైతు, AI టెక్నీషియన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో పాటు, రైతులు ఈ లింక్ www.dahd.nic.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా సంబంధిత మంత్రిత్వ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 011-23383479 కు కాల్ చేసి మరింత సమాచారాన్ని పొందవచ్చు.

Also read:

పిల్లలకు తల్లిపాలు ఎంత కాలం ఇస్తే మంచిది.. వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది..!

TS Weather Alert: తెలంగాణలో చలిగాలులు.. రాగల మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్..

Danish Siddiqui: భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీని తాలిబన్లే కాల్చి చంపారు.. ఆఫ్ఘన్ భద్రతాదళాల ధ్రువీకరణ