padma awards: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్..

|

Jan 25, 2021 | 9:35 PM

padma awards 2021:  కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను ప్రకటించింది.

padma awards: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్..
Follow us on

padma awards 2021:  కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 119 మంది పద్మ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్ పురస్కారలు ప్రకటించగా.. 10 మందికి పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. 102 మంది పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది. ముగ్గురు తెలుగు వారికి పద్మశ్రీ పురస్కారాలు దక్కగా.. దివంగత గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు‌ను కేంద్రం ప్రకటించింది. తమిళనాడు కోటాలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జపాన్ మాజీ ప్రధాని షింజూ అబేకు కూడా కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. పద్మ అవార్డులు పొందిన వారి వివరాలు ఇవే..

పద్మవిభూషణ్ పురస్కారం..
1. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే
2. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
3. డాక్టర్ మోనప్ప హెగ్డే
4. నరీందర్ సింగ్ కపనీ
5. మౌలానా వాహుద్దీన్ ఖాన్
6. బి.బి. లాల్
7. సుదర్శణ్ సాహో

పద్మభూషణ్ పురస్కారం..
1. కృష్ణన్ నాయర్ శాంతకుమారి
2. తరుణ్ గోగోయ్
3. చంద్రశేఖర్ కంబ్రా
4. సుమిత్రా మహజన్
5. నృపేంద్ర మిశ్రా
6. రామ్ విలాస్ పాశ్వాన్
7. కేశూభాయ్ పటేల్
8. కాల్బే సాదిఖ్
9. రజినికాంత్ దేవిదాస్ ష్రాఫ్
10. టార్లోచన్ సింగ్

పద్మశ్రీ పురస్కారాలు పొందిన వారి పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడొచ్చు..

 

Also read:

Seerat Kapoor: దర్శకుడితో దిగిన ఫొటోను షేర్ చేసిన అందాల భామ… ఆయనది ఎన్‌సైక్లోపిడియా మెదడంటూ పొగడ్తలు..

Traffic Restrictions in Hyderabad: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏ రూట్లలో ఆంక్షలు పెట్టారంటే..