Seerat Kapoor: దర్శకుడితో దిగిన ఫొటోను షేర్ చేసిన అందాల భామ… ఆయనది ఎన్‌సైక్లోపిడియా మెదడంటూ పొగడ్తలు..

Seerat Kapoor Shares Director Photo: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి సీరత్ కపూర్. తనం అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది సౌత్‌లో నటించింది..

Seerat Kapoor: దర్శకుడితో దిగిన ఫొటోను షేర్ చేసిన అందాల భామ... ఆయనది ఎన్‌సైక్లోపిడియా మెదడంటూ పొగడ్తలు..
Follow us

|

Updated on: Jan 25, 2021 | 9:12 PM

Seerat Kapoor Shares Director Photo: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి సీరత్ కపూర్. తనం అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది సౌత్‌లో నటించింది కొన్ని సినిమాలే అయినా నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ‘రన్ రజా రన్’తో తొలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీరత్.. ‘రాజు గారి గది2’, ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాలతో విజయాలను అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా.. తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదలైన ‘మా వింత గాధ వినుమా’ సినిమాతో డిజిటల్ స్క్రీన్‌పై కూడా తళుక్కుమంది. ఈ సినిమా ప్రస్తుతం మంచి రెస్పాన్స్‌తో డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక సీరత్ కపూర్ తాజాగా ‘మారిచ్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ధృవ్ లాథ‌ర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నసీరుద్దిన్‌ షా, అనితా, తుషార్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీరత్ కపూర్ ‘మారిచ్’ చిత్ర దర్శకుడితో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేసింది. దర్శకుడు ధృవ్ లాథ‌ర్‌‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘మా థ్రిల్లర్ సినిమా వెనకా ఉన్న ఎన్‌సైక్లోపిడియా మైండ్ ఇతనే. మా చిత్ర దర్శకుడు ధృవ్ లాథ‌ర్‌‌ను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను’ అంటూ క్యాప్షన్ జోడించిందీ బ్యూటీ.

View this post on Instagram

A post shared by Seerat Kapoor (@iamseeratkapoor)

Also Read: FCUK Movie : ఫ్రంట్ లైన్ వారియర్ చేతుల మీదుగా జ‌గ‌ప‌తిబాబు సినిమా ఫస్ట్ సాంగ్..

నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్
స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్‌తో జియో నయా ప్లాన్‌ లాంచ్