Bipin Rawat Helicopter Crash: ఇద్దరూ ఇద్దరే .. ఒకరు నిరంతర దేశ సేవలో నిమగ్నమైతే.. మరొకరు సేవా కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేసేవారు. ఇద్దరూ కలిసి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. వీరి మరణం అందరినీ కలచివేస్తోంది. జనరల్ బిపిన్ రావత్ భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. రెండేళ్ల క్రితం అంటే డిసెంబర్ 2019లో ఈ పదవిలో బిపిర్ రావత్‌ను నియమించింది కేంద్రం. ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయిన తరువాత ఈ పదవిని చేపట్టారు బిపిన్ రావత్. ప్రస్తుతం భారత్‌లో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. చైనా, పాకిస్తాన్ దూకుడుకు కళ్లెం వేయడంలో బిపిన్ రావత్‌కు ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. లద్దాఖ్ సంక్షోభం సమయంలో ఆయన త్రివిధ దళాలకు వ్యూహకర్తగా పనిచేశారు. భారత్ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు ఆయన మార్గదర్శి. ఉత్తరాఖండ్‌లోని పౌరీలో రాజ్‌పుత్ కుటుంబంలో ఆయన జన్మించారు బిపిన్‌రావత్. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.
అయితే, ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక కూడా మరణించారు. ఈ వార్త కూడా వేలాది మందిని ఆవేదనకు గురిచేసింది. సైకాలజీలో డిగ్రీ చేసిన మధులిక ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. దీంతో ఆమె మృతి తీరని లోటని కన్నీరుమున్నీరవుతున్నారు. మధులిక తండ్రి దివంగత రాజకీయ నేత మృగేంద్ర సింగ్. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ కు చెందిన మధులిక ఢిల్లీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తరువాత సామాజిక సేవకు అంకితమయ్యారు. క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచారు మధులిక. ఆర్మీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల భార్యలు వివిధ వృత్తుల్లో రాణించేలా మధులిక ప్రోత్సహించేవారు. స్వయం ఉపాధి కోర్సుల్లో వారికి శిక్షణ అందించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి అండగా నిలిచేవారు. ఆర్మీ వైవ్స్ వెల్ఫ్‌వేర్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు మధులిక. విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారుల భార్యలతో పాటు దివ్యాంగ బాలల జీవితాల్లో వెలుగులు నింపారు మధులిక.
Also read: