ఐఎన్ఎక్స్ కేసులో ఇంద్రాణీని ప్రశ్నించనున్న సీబీఐ

| Edited By:

Sep 10, 2019 | 3:39 PM

దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జియాను సీబీఐ మంగళవారం విచారించనుంది. మరికాసేపట్లో ముంబై బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెను సీబీఐ విచారించనున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఇంద్రాణీ ముఖర్జీయా.. ఐఎన్ఎక్స్ మీడియా సంస్ధకు గతంలో అధినేతగా పనిచేశారు. ఈ సంస్ధకు అక్రమ మార్గంలో విదేశాలనుంచి నిధులు భారీగా వచ్చాయనే ఆరోపణలున్నాయి. ఈ నిధులు రావడానికి కేంద్ర మాజీమంత్రి చిదంబరం ప్రధాన నిందితునిగా అనుమానిస్తూ సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన […]

ఐఎన్ఎక్స్ కేసులో ఇంద్రాణీని ప్రశ్నించనున్న సీబీఐ
Follow us on

దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జియాను సీబీఐ మంగళవారం విచారించనుంది. మరికాసేపట్లో ముంబై బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెను సీబీఐ విచారించనున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఇంద్రాణీ ముఖర్జీయా.. ఐఎన్ఎక్స్ మీడియా సంస్ధకు గతంలో అధినేతగా పనిచేశారు. ఈ సంస్ధకు అక్రమ మార్గంలో విదేశాలనుంచి నిధులు భారీగా వచ్చాయనే ఆరోపణలున్నాయి. ఈ నిధులు రావడానికి కేంద్ర మాజీమంత్రి చిదంబరం ప్రధాన నిందితునిగా అనుమానిస్తూ సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా గతంలో జైలు శిక్షను అనుభవించారు. అయితే వీరి పేర్లను ఇంద్రాణీ ముఖర్జీయా బయటపెట్టడంతో సాక్ష్యాధారాలు సేకరించాలని కోర్టు సూచించింది.

ఇంద్రాణీ ఆమె కుమార్తె షీనా బోరా హత్య కేసులో ముంబై బైకుల్లా జైలులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు , చిదంబరం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయనకు ఈనెల 19 వరకు కస్టడీ కొనసాగుతుంది.