అన్నీ చిల్లర రాజకీయాలే ! కాంగ్రెస్ పై ఫైర్ ! ఊర్మిళ గుడ్ బై !

లోక్ సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ గా భావించి టికెట్ కూడా ఇఛ్చిన కాంగ్రెస్ పార్టీని బాలీవుడ్ నటి, ఈ పార్టీ నేత ఊర్మిళా మటోండ్కర్ వీడారు. అయిదు నెలల పాటు కాంగ్రెస్ లో సాగిన ఈమె మంగళవారం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో అంతర్గత రాజకీయాలు మరీ ముదిరిపోయాయని, చిల్లర రాజకీయాలకు తనను పావుగా వినియోగించుకోవడాన్ని తానిక సహించబోనని ఆమె అన్నారు. ముంబై కాంగ్రెస్ లోని కీలక నేతల్లో […]

అన్నీ చిల్లర రాజకీయాలే ! కాంగ్రెస్ పై ఫైర్ ! ఊర్మిళ గుడ్ బై !
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 10, 2019 | 4:40 PM

లోక్ సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ గా భావించి టికెట్ కూడా ఇఛ్చిన కాంగ్రెస్ పార్టీని బాలీవుడ్ నటి, ఈ పార్టీ నేత ఊర్మిళా మటోండ్కర్ వీడారు. అయిదు నెలల పాటు కాంగ్రెస్ లో సాగిన ఈమె మంగళవారం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో అంతర్గత రాజకీయాలు మరీ ముదిరిపోయాయని, చిల్లర రాజకీయాలకు తనను పావుగా వినియోగించుకోవడాన్ని తానిక సహించబోనని ఆమె అన్నారు. ముంబై కాంగ్రెస్ లోని కీలక నేతల్లో సామర్థ్యం లేకపోవడమో, లేదా పార్టీ అభివృధ్దికి, మెరుగుదలకు అవసరమైన మార్పును తేలేక పోవడమో జరుగుతోందని ఆమె మీడియాకు ఇఛ్చిన ఓ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. ఒకవిధంగా వారిని అసమర్థులుగా అభివర్ణించారు.’ పార్టీలో ఓ విశిష్టమైన లక్ష్య సాధనకోసం కృషి చేసే బదులు.. చిల్లర (పెట్టీ) పాలిటిక్స్ కి సాధనంగా కొన్ని స్వార్థపర శక్తులు నన్ను వినియోగించుకుంటున్నాయి. నా రాజకీయ, సామాజిక దృక్పథాలు ఈ శక్తుల తీరుకు తగినట్టు నడుచుకునేందుకు నిరాకరిస్తున్నాయి ‘ అని ఊర్మిళ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈమె ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓటమి చవి చూశారు. అటు-ముంబై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మిలింద్ దేవరకు తాను రాసిన లేఖ విషయంలో తనకు ద్రోహం జరిగిందని ఊర్మిళ ఆరోపించారు. (మిలింద్ దేవర గతవారమే తన పదవికి రాజీనామా చేశారు). ఆ లేఖలో తను ఎన్నో ఫిర్యాదులు చేశానని, అందులోని రహస్య సమాచారాన్ని కావాలనే మీడియాకు లీక్ చేశారని ఊర్మిళ మటోండ్కర్ వాపోయారు. ఇటీవలి వరకు కాంగ్రెస్ నేతగా బీజేపీని విమర్శిస్తూ వఛ్చిన ఈమె ఇక తన పొలిటికల్ కెరీర్ ని ‘ కాషాయ దళం ‘ వైపు మళ్లిస్తారేమో చూడాలి.

ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ ఇలా.. ఆ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రైళ్లలోనూ..

ఆ ఊర్లో రాత్రికి రాత్రే గుడి పూజారి స‌జీవ స‌మాధి.. ఆ తర్వాత

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

థియేటర్‌లో గోదారి గట్టు మీద సాంగ్‌‌‌కు స్టెప్పులేసిన జంట.. వీడియో

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..

గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..