CBI: ఐఆర్‌ఎస్‌ అధికారి ఇళ్లలో సీబీఐ సోదాలు.. కిలోల కొద్దీ బంగారం, భారీగా ఆస్తులు సీజ్..!

అధికారుల దర్యాప్తులో నిందితుడికి ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లోని లూథియానా, బటిండా, మొహాలీ, జిరాక్‌పూర్, న్యూ చండీగఢ్‌లలో సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అమిత్‌ కుమార్‌ సింఘాల్‌కు చాలా ఆస్తులు ఉన్నాయని సీబీఐ గుర్తించింది. ఇది మాత్రమే కాదు నిందితుడికి దుబాయ్‌లో కూడా ఆస్తులు ఉన్నాయని గుర్తించిన సీబీఐ దీనిపై దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో,

CBI: ఐఆర్‌ఎస్‌ అధికారి ఇళ్లలో సీబీఐ సోదాలు.. కిలోల కొద్దీ బంగారం, భారీగా ఆస్తులు సీజ్..!
Cbi Raids On Irs Officer

Updated on: Jun 03, 2025 | 1:50 PM

అవినీతి కేసులో అరెస్టు అయిన సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అమిత్‌ కుమార్‌ సింఘాల్‌కు చెందిన పలు ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా బంగారు ఆభరణాలు, వెండి, గోల్డ్‌ కాయిన్స్‌తో పాటు రూ.కోటి నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అవినీతి కేసులో రూ.కోటి నగదు, 3.5కిలోల బంగారం, 2 కిలోల వెండి సీజ్‌ చేశారు. ఆదివారం 25లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడగా..పంజాబ్‌లో అతడి ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లలో సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారికి సంబంధించిన స్థలాలపై సీబీఐ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.1 కోటి విలువైన నగదు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, రూ.3.5 కోట్ల విలువైన వెండి, బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రూ.25 లక్షల లంచం కేసులో అరెస్టయిన అధికారి అమిత్ కుమార్ సింఘాల్, అతని సహచరుల ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. 3.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి, రూ.1 కోటి నగదును స్వాధీనం చేసుకుంది.

అధికారుల దర్యాప్తులో నిందితుడికి ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లోని లూథియానా, బటిండా, మొహాలీ, జిరాక్‌పూర్, న్యూ చండీగఢ్‌లలో సీనియర్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అమిత్‌ కుమార్‌ సింఘాల్‌కు చాలా ఆస్తులు ఉన్నాయని సీబీఐ గుర్తించింది. ఇది మాత్రమే కాదు నిందితుడికి దుబాయ్‌లో కూడా ఆస్తులు ఉన్నాయని గుర్తించిన సీబీఐ దీనిపై దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో, హర్ష్ సింఘాల్ విదేశాలలో తన ఆస్తులు, వ్యాపారాలను చూసుకునేవాడని CBI కనుగొంది. ప్రస్తుతం, సింఘాల్ న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ టాక్స్ పేయర్స్ సర్వీసెస్‌లో అదనపు జనరల్‌గా నియమితులయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..