CBI Raids: డిప్యూటీ సీఎం నివాసం, కార్యాలయంలో మరోసారి సీబీఐ దాడులు

దేశంలో సీబీఐ దాడులు రోజురోకు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సీబీఐ దాడులు కొనసాగిస్తోంది. ఇక తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌..

CBI Raids: డిప్యూటీ సీఎం నివాసం, కార్యాలయంలో మరోసారి సీబీఐ దాడులు
CBI Raids

Updated on: Jan 14, 2023 | 4:56 PM

దేశంలో సీబీఐ దాడులు రోజురోకు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సీబీఐ దాడులు కొనసాగిస్తోంది. ఇక తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా నివాసంలో మరోసారి సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. సిసోడియా నివాసంతో పాటు కార్యాలయంలో కూడా సోదాలు చేస్తున్నారు సీబీఐ అధికారులు. గతంలో కూడా లిక్కర్‌ స్కాంలో సిసోడియా నివాసంలో, కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించింది.

అప్పుడు సీబీఐ సోదాల్లో ఏమి దొరకలేదని ,ఇప్పుడు కూడా ఏమి దొరకదన్నారు డిప్యూటీ సీఎం సిసోడియా. తన గ్రామంలో కూడా సోదాలు నిర్వహించారని అన్నారు. ఎలాంటి తప్పు చేయలేదని ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

 

అయితే గత ఏడాదిలో కూడా మనీష్‌ సిసోడియా ఇంట్లో సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ దాడులు నిర్వహించింది సీబీఐ. ఆ సమయంలో ఢిల్లీలోని సుమారు 20 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అయితే జరిగిన దాడుల్లో ఎలాంటి పత్రాలు లభించలేవని అప్పట్లో మనీష్‌ సిసోడియా వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి