Gangetic Dolphin : ఒడిస్సాలోని జాలరి వలలో చిక్కుకున్న అరుదైన గంగా డాల్ఫిన్ మృతదేహం..

|

Feb 19, 2021 | 6:31 PM

ఒడిశా లోని తీరప్రాంతమైన భద్రాక్ జిల్లాలోని సలాండి నదిలో మత్య్సకారుని వలకు ఒక డాల్ఫిన్ చిక్కుంది. అది మరణించి ఉండడంతో వెంటనే మత్య్సకారులు అటవీశాఖ ధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ డాల్ఫిన్ సుమారు 5.5 అడుగుల..

Gangetic Dolphin : ఒడిస్సాలోని జాలరి వలలో చిక్కుకున్న అరుదైన గంగా డాల్ఫిన్ మృతదేహం..
Follow us on

Gangetic Dolphin : ఒడిశా లోని తీరప్రాంతమైన భద్రాక్ జిల్లాలోని సలాండి నదిలో మత్య్సకారుని వలకు ఒక డాల్ఫిన్ చిక్కుంది. వలలో చిక్కుకున్న డాల్ఫిన్ మరణించి ఉండడంతో వెంటనే మత్య్సకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ డాల్ఫిన్ సుమారు 5.5 అడుగుల పొడవు ఉందని.. 50 కిలొలకంటే ఎక్కువ బరువు ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే డాల్ఫిన్ శరీరం పై ఎటువంటి గాయం గుర్తులు లేవన్నారు.

క్రుటిబాస్‌పూర్ గ్రామానికి చెందిన మత్స్యకారుడు బుధవారం సలాండి నదిలో చేపల కోసం వల వేసినప్పుడు ఈ డాల్ఫిన్ మృత దేహం పడినట్లు.. అటవీ శాఖ అధికారులు తెలిపారు. వెంటనే డాల్ఫిన్ గురించి గోవింద్‌పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తమకు సమాచారం ఇచ్చారన్నారు భద్రాక్ ఫారెస్ట్ రేంజర్ సుబాస్ నాయక్
ఇది గంగా డాల్ఫిన్ అని… ఎందుకంటే దీనికి పొడవైన, కొనదేరిన ముక్కును కలిగి ఉందని.. పొడవైన పదునైన దంతాల ఎగువ , దిగువ దవడ సెట్లు నోరు మూసినప్పుడు కూడా కనిపించాయని ఫారెస్ట్ రేంజర్ సుబాస్ నాయక్ చెప్పారు. అయితే డాల్ఫిన్ ఎలా మరణించిందో తెలుసుకోడం కోసం పోర్టు మార్టం నిర్వహించాల్సి ఉందని అన్నారు. ఈ డాల్ఫిన్ నదిలోకి ఎలా వచ్చిందో తెలియదని.. బహుశా సముద్రం లేదా వేరే నది ప్రయాణించి వచ్చి ఉండొచ్చని తెలిపారు. ఇక 2005 లో కూడా, బాలాసోర్ జిల్లాలోని బుధబలంగా నదిలో ఒక గంగా డాల్ఫిన్ దొరికిందని ఆయన గుర్తు చేశారు.

గంగా డాల్ఫిన్ రకమైన నదీ జలాలలో జీవించే డాల్ఫిన్. ఈ నదీ డాల్ఫిన్లు ఎక్కువగా బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, పాకిస్థాన్ దేశాలలో విస్తరించింది. ఈ గంగా నది డాల్ఫిన్ ప్రాథమికంగా గంగా, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదులలో కనిపిస్తాయి.

Also Read:  ఫోటో తీస్తుండగా సముద్రంలో పడిన సెల్ ఫోన్.. దానికోసం గడ్డకట్టే నీటిలో దూకిన వ్యక్తి ఎక్కడంటే..!

ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు..