Cloudburst: వర్ష బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోతున్న ఇండ్లు, భవనాలు.. భారీగా ఆస్తినష్టం..

వరద ఉధృతి పొటెత్తింది. దాంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నది ప్రవాహ ఉధృతికి ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. వరదలకు నది తీరం కోతకు గురైంది. దీంతో నది ఒడ్డున ఉన్న..

Cloudburst: వర్ష బీభత్సం.. కళ్లముందే కొట్టుకుపోతున్న ఇండ్లు, భవనాలు.. భారీగా ఆస్తినష్టం..
Building Collapses

Edited By: Team Veegam

Updated on: Sep 10, 2022 | 5:33 PM

Cloudburst: ఉత్తరాఖండ్ లో మరోసారి వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఓ బిల్డింగ్‌ అమాంతం కూలింది. అనేక ఇండ్లు నీట మునిగాయి. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. పిథోరగ‌ఢ్‌ జిల్లాలో భారత్‌, నేపాల్‌ సరిహద్దుకు దగ్గరగా ఉన్న లాస్కో నదిలో అర్ధరాత్రి భారీ క్లౌడ్‌బర్ట్స్‌ ఏర్పడింది. ఈ ఘటనలో ఒక మహిళ మృత్యువాతపడినట్టుగా తెలిసింది. అటు ధార్చుల పట్టణంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. పలు చోట్ల దాదాపు 30కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ఉత్తరఖండ్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా కాలి నదికి వరద ఉధృతి పొటెత్తింది. దాంతో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నది ప్రవాహ ఉధృతికి ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. వరదలకు నది తీరం కోతకు గురైంది. దీంతో అంచులో ఉన్న ఒక బిల్డింగ్‌ కళ్లముందే కూలింది. ఖోటిల గ్రామంలో 50కిపైగా ఇండ్లు నీట మునిగాయి. కాలి నది ఉధృతంగా ప్రవహించడంతోపాటు ప్రమాదకర స్థితికి చేరడంపై ప్రజలను హెచ్చరించారు. ఆ నదిపై ఉన్న అన్ని వంతెనల మీదుగా రాకపోకలు సాగించవద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఉత్తరాఖండ్‌ పోలీస్‌, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమయ్యాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని డిఎం తెలిపారు. ప్రజలు, పర్యాటకులు సురక్షితంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి