Jo Lindner: ప్రముఖ బాడీ బిల్డర్ జో లిండ్నర్ మృతి.. కారణం ఇదే

ఆరోగ్యంగా ఉండటానికి, శరీరాన్ని ధృఢంగా ఉంచుకోవడానికి చాలామంది జిమ్‌లకు వెళ్తుంటారు. అయితే ఈ మధ్యన బాడీ బిల్డర్లు కూడా అకస్మాత్తుగా మరణిస్తున్న సందర్భాలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్ జో లిండ్నర్ (30) మృతి చెందడం కలకలం రేపింది.

Jo Lindner: ప్రముఖ బాడీ బిల్డర్ జో లిండ్నర్ మృతి.. కారణం ఇదే
Jo Lindner

Updated on: Jul 03, 2023 | 8:39 AM

ఆరోగ్యంగా ఉండటానికి, శరీరాన్ని ధృఢంగా ఉంచుకోవడానికి చాలామంది జిమ్‌లకు వెళ్తుంటారు. అయితే ఈ మధ్యన బాడీ బిల్డర్లు కూడా అకస్మాత్తుగా మరణిస్తున్న సందర్భాలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్ జో లిండ్నర్ (30) మృతి చెందడం కలకలం రేపింది. అతడ్ని ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 85 లక్షల మంది ఫాలో అవుతున్నారు. లిండ్నర్ ఫిట్‌నెస్ వీడియోలతో తన యూట్యూట్‌లో దాదాపు 50 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే అతను 3 రోజుల క్రితం ఓ అరుదైన వ్యాధితో చనిపోయారు. ఈ విషయాన్ని అతని స్నేహితురాలు నిచా వెల్లడించింది. మెడనొప్పితో బాధపడిన ఆయన మూడు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో అతని ఫాలోవర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు్న్నారు.

ఆయన మరణంతో శరీర సౌష్ఠవం కోసం చేసే పద్దతులు మరోసారి చర్చకు వచ్చాయి. అయితే లిండ్నర్ మాములుగా థాయ్‌లాండ్, దుబాయ్ లాంటి దేశాల్లో ఫిట్‌నెస్ వీడియోలు తీసి పోస్టు చేసేవాడు. ఈ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ వచ్చింది. నిజానికి అతను కండరాల వ్యాధి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది.
అయితే ఈ వ్యాధి వల్ల కండారాలు ఒత్తిడికి గురైన సమయంలో భిన్నంగా స్పందిస్తాయి. ఇక కండరంపై ఒత్తిడి పెంచినప్పుడు రసాయనిక చర్య వల్ల అవి ఒక చోటుకు చేరి బలంగా కనిపిస్తాయి. ఇక రిపిలింగ్ మజిల్ డిసీజ్ ఉన్నవారి కండరాలు ఒత్తిడికి గురై వేరేలా అలల వలె కనిపిస్తాయి. పలు సందర్భాల్లో క్రాంప్ ఏర్పడి గడ్డవలే వచ్చి తీవ్రమైన నొప్పికి కారణం అవుతాయి. మరో విషయం ఏంటంటే తన సమస్యను లిండ్నర్ కూడా పలుమార్లు తన ఫాలోవర్లకు చెబుతుండేవాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.