మాస్క్‌ విషయంలో నిర్లక్ష్యం.. ఏకంగా రూ.4.7కోట్లు వసూలు చేసిన బీఎంసీ

కరోనా బారిన పడకుండా ఉండేందుకు, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌లను ధరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

మాస్క్‌ విషయంలో నిర్లక్ష్యం.. ఏకంగా రూ.4.7కోట్లు వసూలు చేసిన బీఎంసీ

Updated on: Nov 08, 2020 | 1:54 PM

Not Wearing Mask fine: కరోనా బారిన పడకుండా ఉండేందుకు, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌లను ధరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బయటకు వచ్చినప్పుడు మాస్క్‌ని తప్పనిసరి చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా కంటపడితే భారీ ఫైన్ వసూలు చేస్తామని కూడా హెచ్చరించాయి. ( మాకు గర్వంగా ఉంది.. కమలా హ్యారీస్‌కి సీఎం జగన్ అభినందనలు

అయితే కొందరు మాత్రం మారడం లేదు. మాకేం అవుతుందిలే అన్న నిర్ల్యక్షంతో మాస్క్‌లు పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలో మాస్క్‌లు పెట్టుకోని వారి నుంచి బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ ఏకంగా రూ.4.7కోట్ల రూపాయల ఫైన్‌ని రాబట్టింది. మార్కెట్‌లోకి వెళ్లే చాలా మంది మాస్క్‌ని ధరించడం లేదని అక్కడి అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో కరోనాపై ఇంకా ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోంది. ( తెరపైకి రజనీకాంత్‌ బయోపిక్‌.. సూపర్‌స్టార్‌గా ధనుష్‌..!

Loading...
Unable to load recommendations.
Follow Us