Bihar CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సెక్యూరిటీ వైఫల్యం మరోసారి బయటపడింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హాజరైన సభలో భారీ శబ్దంతో పేలుడు సంభవించిన ఘటన కలకలం సృష్టించింది. నలంద నితీష్ నిర్వహిస్తున్న జనసభలో పేలుడు జరిగింది. సీఎం కూర్చున్న స్టేజ్ దగ్గర అత్యంత సమీపంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు తరువాత స్టేజ్‌పై ఉన్న వాళ్లు పరుగులు పెట్టారు. ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీహార్‌లోని నలంద జిల్లాలో మంగళవారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డైలాగ్ యాత్ర సందర్భంగా, సిలావ్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతానికి సరిగ్గా ఐదు మీటర్ల దూరంలో పేలుడు సంభవించిందని, దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే, సంసిద్ధతను ప్రదర్శిస్తూ, పేలుడు చేసిన యువకుడిని భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
सीएम नीतीश के सामने हुआ धमाका.हिरासत में लिया गया एक शख्स.युवक के पास से पटाखा और माचिस की तीली हुआ बरामद.सीएम नीतीश कुमार आज नालंदा के सिलाव में निजी यात्रा पर लोगों से मिल रहे थे.नालंदा से अमृतेश की रिपोर्ट. pic.twitter.com/0ZLhEhmOME
— Prakash Kumar (@kumarprakash4u) April 12, 2022
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఆ యువకుడు కొన్ని పేలుడు పదార్థాలకు నిప్పు పెట్టి విసిరాడు. దాని కారణంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరైన కార్యక్రమం సందర్భంగా పేలుడు సంభవించింది. అరెస్ట్ అయిన యువకుడు శుభమ్ ఆదిత్య ఇస్లాంపూర్‌లోని సత్యార్ గంజ్ నివాసిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదిలావుంటే, కొద్దిరోజుల క్రితమే పాట్నా సాహిబ్ దగ్గర కూడా నితీష్‌పై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన వ్యక్తి నితీష్‌పై దాడికి పాల్పడ్డాడు.
Read Also… Nithish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ సభలో బాంబు దాడి.. పోలీసుల అదువులో అనుమానితుడు..