AAP: ఆప్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమండ్..

|

Feb 04, 2023 | 3:49 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. లిక్కర్‌ స్కాంలో పేరు రావడంతో సీఎం పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలంటూ..

AAP: ఆప్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమండ్..
Arvind Kejriwal
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. లిక్కర్‌ స్కాంలో పేరు రావడంతో సీఎం పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. లిక్కర్‌ స్కాంలో ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీట్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును ఈడీ ప్రస్తావించింది. సీఎం కార్యాలయం లోనే లిక్కర్‌ స్కాంకు స్కెచ్‌ గీశారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఆప్‌ కార్యాలయం లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మీ పని మీరు చేసుకోండి.. ఇతరుల పనిని వారు చేసుకోనివ్వండి.. అందరి పనుల్లో జోక్యం చేసుకోవద్దని కోరారు. వాస్తవానికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను పంపిన సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును త్వరలో కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేస్తుందని శుక్రవారం అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

మరోవైపు.. ఢిల్లీ రాస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన 428 పేజీల ఛార్జిషీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరుండటం సంచలనం కల్గిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చింది.

ఇవి కూడా చదవండి

వీరిలో సమీర్ మహేంద్రు, ఖావో గలీ రెస్టారెంట్స్, బబ్లీ బేవరేజెస్, ఇండో స్పిరిట్స్, ఇండో స్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్, విజయ్ నాయర్, పి శరత్ చంద్ర, ట్రైడెంట్ కేంఫర్ లిమిటెడ్, అవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గోనామిక్స్ ఈకోసిస్టమ్స్, బినోయ్ బాబు, పెర్నోడ్ రిచర్డ్ ఇండియా లిమిటెడ్, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, కేఎస్‌జేఎస్ స్పిరిట్స్, మెస్సర్స్ బడ్డీ రిటైల్, పాపులర్ స్పిరిట్స్ పేర్లు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..