
NDA Expansion Plan: బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఎన్డీయే విస్తరణపై ఫోకస్ పెట్టింది బీజేపీ. బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలను కలుపుకుని పోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలుపార్టీలతో అమిత్‌షా, నడ్డా సంప్రదింపులు జరిపింది. ఎంపీ సీట్లు లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై బుధవారం రాత్రి ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే అన్ని విషయాలపై ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ సూచనలతో అమిత్‌షా, జేపీ నడ్డా ద్వయం యాక్షన్‌లోకి దిగింది. సోమవారం ఫుల్ క్లారిటి ఇవ్వనుంది అధిష్టానం. 2024 పార్లమెంట్ అంతకుముందు వచ్చే నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇందులో భాగంగా తాము బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలను కలుపుకుని పోవాలని నిర్ణయించింది.
బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు కీలక నేతలు. నడ్డా, అమిత్‌షాలు పలు రాష్ట్రాల నేతలతో చర్చించిన అనంతరం నివేదిక తయారుచేసి ప్రధాని ముందుంచారు. మోదీ సలహాలు, సూచనలతో అగ్రనేతలు రంగంలో దిగారు. గతంలో ఎన్డీయే వీడిన పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రాకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు లక్ష్యంగా వ్యూహాలు చేస్తున్నారు. చిన్నచిన్న పార్టీలు, ఓటుబ్యాంకు బలంగా ఉన్న శక్తులతో కలిసి పనిచేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. సోమవారం దీనిపై ఫుల్ క్లారిటీ ఇవ్వనుంది పార్టీ. ఢిల్లీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు, ఎన్డీయే విస్తరణ, క్యాబినెట్ మార్పులపై మరింత సమాచారం సోమవారం పూర్తి క్లారిటీ రానుంది.
ఇదిలావుంటే, రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా తెలంగాణ నాయకత్వంలో మార్పులు చేస్తుందని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు కూడా ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. బండి సంజయ్‌కు జాతీయస్థాయిలో పదవి ఇవ్వనుంది. ఈటల రాజేందర్‌కు కూడా కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లుగా సమాచారం. తెలంగాణలో సొంతంగానే బలపడాలని నిర్ణయం తీసకుంది బీజేపీ హైకమాండ్. ఇదే అంశంపై త్వరలో రోడ్‌మ్యాప్ ఇవ్వనున్నారు అమిత్‌షా, జేపీ నడ్డా. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణలోనూ భారీ మార్పులు ఉంటాయని ఇప్పటికే అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. బండి సంజయ్‌ను మార్చి.. కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే బండికి జాతీయస్థాయిలో ప్రాధాన్యత ఉన్న పదవి ఇస్తారంటున్నారు. ఇక ఈటల రాజేందర్‌కు కూడా రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నాయకత్వ మార్పు, మంత్రివర్గంలో చోటు, జనసేనతో పొత్తు వంటి అంశాలపై పరిశీలిస్తున్నారు. ఎన్డీయేతో గతంలో మిత్రుడిగా ఉన్న టీడీపీతో మళ్లీ పొత్తు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్‌షాతో చంద్రబాబు సమావేశం అయ్యారు. మరోవైపు క్యాబినెట్ విస్తరణలో ఏపీకి చోటు ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం