
ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత.. బీజేపీనే స్వయంగా రెండు చార్ట్‌లు రిలీజ్ చేసింది. ఈ దేశంలో 28 రాష్ట్రాలుంటే అందులో 17 రాష్ట్రాల్లో ఏకంగా బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్డీయే ముఖ్యమంత్రులు కొనసాగుతున్నారు. ఇదీ.. ‘నేషన్ విత్ నమో’ అంటే అంటూ ఓ చార్ట్ విడుదల చేసింది. మరో చార్ట్ సారాంశం ఏంటంటే.. 2013లో దేశవ్యాప్తంగా కేవలం 773 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే.. ఇప్పుడు 1798 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే రెండింతలకు పైగా రైజింగ్. మామూలు ఎక్స్‌పాన్షన్ కాదిది. బట్.. టార్గెట్ ఇక్కడితోనే అయిపోలేదు, ఆగిపోలేదని చెబుతోంది బీజేపీ. నార్త్ మిషన్ ఆల్‌మోస్ట్ కంప్లీట్ కాబట్టి.. ఇక ఫోకస్ సౌత్ మీదే అని చెబుతోంది. గంగోత్రి నుంచి గంగాసాగర్.. భారతీయ జనతా పార్టీ సాధించిన అతిపెద్ద రాజకీయ విజయానికి నిదర్శనం ఇది. గంగా నది జన్మస్థానం గంగోత్రి. అది ఉన్నది ఉత్తరాఖండ్‌లో. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీనే. అక్కడి నుంచి గంగమ్మ ప్రవహించే అన్ని ప్రధాన రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ లేదా దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. చివరికి గంగా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో కూడా బీజేపీనే. దక్షిణ బెంగాల్‌లో ఆ ప్రాంతానికి ఉన్న పేరు గంగాసాగర్. అదో పవిత్ర...