యూపీలోని బలియా జిల్లాలో ఓ వ్యక్తిని గన్ తో కాల్చి చంపిన ధీరేంద్ర సింగ్ అనే తన మద్దతుదారుడిని సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ని పార్టీ అధ్యక్షుడు జేపీ.నడ్డా తీవ్రంగా హెచ్చరించారు. సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఈ జిల్లాలో ఇటీవల పంచాయతీ జరుగుతుండగా ధీరేంద్ర సింగ్.. జైప్రకాష్ అనే గ్రామస్థుడిపై పోలీసులు, అధికారులు ఉండగానే కాల్పులు జరిపాడు. గాయపడిన జైప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే తన అనుచరుడు చేసింది సరైనదేనని, ఆత్మరక్షణార్థం అతడు ఫైర్ చేశాడని సురేంద్ర సింగ్ అతడిని వెనకేసు కొచ్చాడు. పరారీలో ఉన్న ధీరేంద్ర సింగ్ లొంగిపోతానంటూ రాగా పోలీసులు నిన్న అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనను, తమ ఎమ్మెల్యే తీరును బీజేపీ హైకమాండ్ సీరియస్ గా పరిగణించింది .