Bill Gates Drives Electric Auto: భారత్ రోడ్లపై ఎలక్ట్రిక్ ఆటో నడిపిన బిల్ గేట్స్.. చ‌ల్తీ కా నామ్ అంటూ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

|

Mar 06, 2023 | 7:28 PM

మీ త‌ర్వాత ట్రిప్‌లో త్రీవీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌తో రేస్‌లో పాల్గొందామ‌ని, ఆ రేసులో మీరు, నేను, స‌చిన్ ఉంటార‌ని ఆనంద్ మ‌హేంద్ర తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bill Gates Drives Electric Auto: భారత్ రోడ్లపై ఎలక్ట్రిక్ ఆటో నడిపిన బిల్ గేట్స్.. చ‌ల్తీ కా నామ్ అంటూ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా
Bill Gates Drives Electric
Follow us on

మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇండియాలో ఆయ‌న ఎల‌క్ట్రిక్ రిక్షాను న‌డిపించి వండర్‌ క్రియేట్‌ చేశారు.. మహేంద్ర కంపెనీకి చెందిన ట్రియో ఎల‌క్ట్రిక్ రిక్షాను ఇండియ‌న్ రోడ్ల‌పై నడుపుతూ హల్‌చల్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బిల్ గేట్స్ త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేశారు. బిల్ గేట్స్ చేసిన పోస్టుపై మ‌హేంద్ర కంపెనీ చైర్మెన్ ఆనంద్ మ‌హేంద్ర స్పందించారు. బిల్‌గేట్స్‌ షేర్‌ చేసిన వీడియోకి ఆనంద్‌ మహేంద్ర ట్వీట్ చేస్తూ చ‌ల్తీ కా నామ్ బిల్ గేట్స్‌కి గాడి అంటూ కామెంట్ చేశారు.

ఆవిష్క‌ర‌ణ‌ల కోసం భార‌తీయుల త‌ప‌న ఎన్న‌టికీ తీరిపోద‌ని, నేనో ఎల‌క్ట్రిక్ రిక్షాను న‌డిపాను అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు బిల్‌గేట్స్‌. ఆ రిక్షా 131 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంద‌ని వివరించారు. ఈ రిక్షాలో న‌లుగురు ప్ర‌యాణికులు ఈజీగా ట్రావెల్‌ చేయగలరని చెప్పారు. ట్రాన్స్‌పోర్టు ఇండ‌స్ట్రీలో కార్బ‌న్‌ర‌హిత వాహ‌నాల‌కు మ‌హేంద్ర కంపెనీ ఆద‌ర్శ‌నీయంగా నిలుస్తుంద‌ని బిల్ గేట్స్ ఆ వీడియోకు కామెంట్ చేశారు.

ట్రియో వాహ‌నాన్ని న‌డిపే స‌మ‌యం మీకు దొరికినందుకు గ‌ర్వంగా ఉంద‌ంటూ ఆనంద్ మ‌హేంద్ర త‌న ట్వీట్‌లో తెలిపారు.  మీ త‌ర్వాత ట్రిప్‌లో త్రీవీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌తో రేస్‌లో పాల్గొందామ‌ని, ఆ రేసులో మీరు, నేను, స‌చిన్ ఉంటార‌ని ఆనంద్ మ‌హేంద్ర తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి