Mobile Phone Missing: స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి సహా స్మార్ట్ ఫోన్ కోసం అల్లాడుతున్నవారే ఎక్కడ చూసినా దర్శనమిస్తారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది తినడానికి తిండి లేకపోయినా ఫర్వాలేదు ఏదోలా బతుకుతాం .. స్మార్ట్ ఫోన్ లేకపోతె జీవితం లేదు అన్న చందంగా ఉంది ప్రస్తుత పరిస్థితి.. తాజాగా ఓ మహిళ తన సెల్ ఫోన్ మిస్ అయిందని బెంగతో ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ విచిత్ర దారుణ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్‌లోని పూర్నియా జిల్లాలో తన మొబైల్ ఫోన్ కనిపించలేదంటూ ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఖాజాంచి హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు ఏరియాలోని ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళ భర్త బిట్టు సింగ్ స్వగ్రామం బనమ్నాఖికి వెళ్ళాడు.. కుమారుడు ఇంటి డాబాపై ఆడుకుంటున్న సమయంలో మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. కొడుకు టెర్రస్‌పై నుంచి కిందకి వచ్చి చూసినప్పుడు తల్లి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కొడుకు తన తండ్రికి ఫోన్ చేసాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బిట్టు బనమ్నాఖి నుండి పూర్నియాకు వచ్చాడు. స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు బృందం విచారణ చేపట్టింది. పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించగా మహిళ గదిలో పైకప్పుకు ఉరివేసుకుని కనిపించింది. అది హత్యా లేక ఆత్మహత్యా అనేది పోస్ట్‌మార్టం తర్వాత మాత్రమే నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.
తన భార్య తనకు ఫోన్ చేసి మొబైల్ ఫోన్ మిస్ అయిందని చెప్పిందని బిట్టు చెప్పాడు. తన భార్యకు మొబైల్ ఫోన్ కు మంచి అటాచ్ మెంట్ ఉంది.. ఇప్పుడు ఆ ఫోన్ కనిపించడం లేదని తన భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని మృతుడి భర్త చెప్పాడు. అయితే ఈ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది . మనిషికి తన జీవితం కంటే.. కుటుంబ సభ్యుల కంటే సెల్ ఫోన్ ఎక్కువైందా అనే ప్రశ్న అందరిలో మొదలైంది.
Also Read: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ .. పవన్ కళ్యాణ్ బైక్ రైడ్.. వీడియో వైరల్