Viral Video: విదేశీ మద్యం తరలిస్తున్న కారుకు ప్రమాదం.. బాటిళ్లతో జనం పరుగోపరుగు! ఎక్కడంటే..

|

Nov 02, 2023 | 7:31 AM

ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులు దొరికిన కాడికి మద్యం బాటిళ్లు తీసుకుని పరుగందుకున్నారు. ఈ విచిత్ర ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే.. బీహార్‌లోని జాతీయ రహదారి 2 పై ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అది రోడ్డుపై వేగంగా వెళుతున్న క్రమంలో..

Viral Video: విదేశీ మద్యం తరలిస్తున్న కారుకు ప్రమాదం.. బాటిళ్లతో జనం పరుగోపరుగు! ఎక్కడంటే..
People Loot Liquor From Car
Follow us on

పట్నా, నవంబర్‌ 2: ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులు దొరికిన కాడికి మద్యం బాటిళ్లు తీసుకుని పరుగందుకున్నారు. ఈ విచిత్ర ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే.. బీహార్‌లోని జాతీయ రహదారి 2 పై ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అది రోడ్డుపై వేగంగా వెళుతున్న క్రమంలో అనూహ్యంగా ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరగడంతో చుట్టపక్కలున్న స్థానికులు గుమికూడారు. అయితే అప్పటికే ఆ వాహనంలో ఉన్న వారు కారు లో ఉన్న విదేశీ మద్యం బాటిళ్లను వదిలి పరారయ్యారు.

కారు లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో అక్కడున్నవారు వాటిని తీసుకుని పరుగులు పెట్టారు. అది చూసి మరికొందరు కారు వద్ద గుమిగూడడంతో రహదారిపై గందరగోళ వాతావరణం నెలకొంది. స్థానికులు సీసాలు పట్టుకుని పారిపోతున్న దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మద్యం బాటిళ్లను దోచుకునేందుకు ఆగి ఉన్న కారు వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు పరుగెత్తడం కనిపిస్తుంది. కొందరు ద్విచక్రవాహనదారులు సైతం తమ బైక్‌ను హైవే మధ్యలో ఆపి మద్యం బాటిళ్ల కోసం పరుగులుతీశారు. నవంబర్‌ 30వ తేదీన చోటుచేసుకున్న ఈ సంఘటన NH 2 వద్ద ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. సమాచారం అందుకున్న దోభి పోలీసులు సంఘటనా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.

ఇవి కూడా చదవండి

అయినప్పటికీ స్థానికులు మద్యం బాటిళ్ల కోసం ఎగబడటం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. కాగా బీహార్‌లో 2016 నుంచి మద్య నిషేధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మద్యం బాటిళ్లను అక్రమంగా తరలించిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ తెలిపారు. అలాగే కారు నుంచి మద్యం బాటిళ్లను తీసుకువెళ్లిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తించి, వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.