రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం (ఏప్రిల్ 9, 2026) పాట్నా నుండి ఢిల్లీకి చేరుకున్నారు . ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసే ముందు ఆయన మీడియాకు ఒక కీలక సమాచారం ఇచ్చారు.

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన
Bihar Cm Nitish Kumar In Delhi

Updated on: Apr 09, 2026 | 8:27 PM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం (ఏప్రిల్ 9, 2026) పాట్నా నుండి ఢిల్లీకి చేరుకున్నారు . ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసే ముందు ఆయన మీడియాకు ఒక కీలక సమాచారం ఇచ్చారు.

“నేను రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇకపై ఇక్కడే ఉంటాను. నేను అక్కడ (బీహార్‌లో) చాలా కాలం పనిచేశాను. ఇప్పుడు ఇక్కడికి (ఢిల్లీకి) తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇన్నేళ్లుగా బీహార్‌లో చాలా పని చేశాను.. ఇప్పుడు ఇక్కడ పనిచేస్తాను. మేము ఇక్కడే ఉండిపోవాలని, ముఖ్యమంత్రి పదవిని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నాము,” అని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. తన కొడుకు నిశాంత్ గురించి నితీష్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ నాయకులు అతని గురించి చెబుతారని అన్నారు.

నితీష్ కుమార్ ప్రకటన తరువాత, ఢిల్లీకి చేరుకున్నాక ఆయన మాట మార్చారా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. జేడీయూ జాతీయ కార్యవర్గ అధ్యక్షుడు సంజయ్ ఝా, నితీష్ కుమార్ సమావేశాల సమయంలో ఢిల్లీలోనే ఉంటారని, మిగతా సమయమంతా పాట్నాలో ఉంటారని స్పష్టంగా చెప్పారు. ఆయన ఎన్డీఏ ప్రభుత్వానికి మార్గదర్శనం చేస్తూనే ఉంటారు. నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్ ముందుకు సాగుతుంది. ఇప్పుడు, ఢిల్లీకి చేరుకున్నాక నితీష్ కుమార్, “నేను రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడే ఉంటాను” అని ప్రకటించారు.

మరోవైపు, “అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను… కొత్త వాళ్లతో పని చేయిస్తాను. అక్కడ ఎంతో పని చేశాను… ఇప్పుడు ఇక్కడే ఉండి అదే పని చేయాలనిపించింది. మూడు నాలుగు రోజుల్లో బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇంతకుముందు కూడా ఢిల్లీలో ఉన్నాను. మధ్యలో బీహార్ వెళ్లాను. ఆ తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చాను.” అని నితీష్ కుమార్ అన్నారు. దీని ద్వారా నితీష్ కుమార్ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇంతకుముందు ఆయన కేంద్రంలో మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఢిల్లీలో మరో కీలక పదవి చేపట్టబోతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us