నీతి ఆయోగ్ భేటీలో బీహార్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు.. ‘ఒక దేశం-ఒకే విద్యుత్తు రేటు’ అమలు చేయాలిన డిమాండ్

|

Feb 21, 2021 | 5:53 PM

కొత్త విద్యుత్ సవరణ చట్టాలపై బీజేపీయేతర రాష్ట్రాలు గగ్గోలు పెడుతుంటే, బీహార్ ముఖ్యమంత్రి కొత్త ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు.

నీతి ఆయోగ్ భేటీలో బీహార్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు.. ‘ఒక దేశం-ఒకే విద్యుత్తు రేటు’ అమలు చేయాలిన డిమాండ్
Follow us on

Nitish kumar Electricity demands : కొత్త విద్యుత్ సవరణ చట్టాలపై బీజేపీయేతర రాష్ట్రాలు గగ్గోలు పెడుతుంటే, బీహార్ ముఖ్యమంత్రి కొత్త ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు. విద్యుత్తు ధరలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉండటం వల్ల బీహార్ నష్టపోతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు విద్యుత్తు రేటు ఒకే విధంగా ఉండాలని అకాంక్షించారు. ‘ఒక దేశం-ఒకే విద్యుత్తు రేటు’ విధానాన్ని అమలు చేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. నీతీ ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 6వ సమావేశంలో శనివారం ఆయన ఈ డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని అమలు చేస్తే బీహార్ వంటి రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని ఆయన తెలిపారు. ప్రస్తుత విధానంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే బీహార్‌కు విద్యుత్తు అధిక ధరకు కొనవలసి వస్తోందన్నారు.

బీహార్ రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం పెరుగిందని గుర్తు చేసిన నితీష్ కుమార్.. 2005లో బీహార్ కేవలం 700 మెగావాట్ల విద్యుత్తును మాత్రమే ఉపయోగించుకుందన్నారు. గత పదిహేనేళ్ళలో రాష్ట్రంలో పరిస్థితులు మారాయని, 2020 జూన్‌లో విద్యుత్తు వినియోగం 5,932 మెగావాట్లకు చేరుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు ప్లాంట్లు సరఫరా చేస్తున్న విద్యుత్తు ధర ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉందన్న నితీష్.. విద్యుత్తు కోసం బీహార్‌ రాష్ట్రం అధిక ధరలు చెల్లించవలసి వస్తోందని చెప్పారు. ప్రజలకు అనువైన ధరకు విద్యుత్తును అందించాలన్న లక్ష్యంతో విద్యుత్తు పంపిణీ కంపెనీలకు మరిన్ని నిధులు మంజూరు చేయవలసి వస్తోందన్నారు. ‘ఒక దేశం-ఒకే విద్యుత్తు రేటు’ విధానాన్ని అమలు చేయాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. యావత్తు దేశానికి ఒకే రేటు విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందన్నారు.

ఇదీ చదవండిః  కోయంబత్తూరులో ఘోరం.. భార్య గొంతు కోసి పారిపోయిన డాక్టర్ భర్త.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు