
బీహార్ రాష్ట్రాన్ని ఎయిడ్స్ వ్యాధి వణికిస్తుంది. రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో ఇటీవల HIV కేసులు విపరీతంగా పెరిగాయి. కొన్ని రోజుల్లో జిల్లాలో సుమారు 7,000కు పైగా యాక్టీవ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో మైనర్లు కూడా ఉన్నట్టు తెలస్తోంది. అయితే తల్లిదండ్రుల ద్వారానే ఈ వ్యాధి చిన్నారులకు సోకి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అవగాహన లేకపోవడమేనంటున్నారు.ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజలకు సరైన అవగాహన రావడం లేదు. దీని వల్లే ఈ వ్యాధి చాలా త్వరగా వ్యాపిస్తుంది.
అయితే ఈ వ్యాధి వ్యాప్తకి ముఖ్య కారణం ఏంటని తెలుసుకునేందుకు జిల్లా హాస్పిటల్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఈ ప్రమాదకర వైరల్ తల్లిదండ్రుల నుంచే చిన్నారుకు సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరికి HIV ఉన్నా.. వారికి పుట్టబోయే పిల్లలకు కూడా ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
అయితే బీహార్ ఎయిడ్స్ నియంత్రణ కమిటీ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తుంది. ఈ సంఖ్యలు అవాస్తవమని కొట్టిపారేసింది. HIV అనేది రోగనిరోధక శక్తిని దెబ్బతీసి, ఎయిడ్స్‌కు కారణమవుతుందని, దీనికి చికిత్స ఉంది కానీ నివారణ కీలకమని పేర్కొంది, ప్రజలు ఈ వ్యాధి భారీన పడకుండా ఉండాలంటే సురక్షితమైన లైంగిక సంపర్కం, రక్త మార్పిడి విషయంలో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.