LTC cash scheme: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..ఆ స్కీమ్‌పై నో ట్యాక్స్ !

|

Feb 06, 2021 | 12:34 PM

కేంద్ర ప్రభుత్వం ఉద్యగులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు. లీవ్ ట్రావెల్ కన్సిషన్ వోచర్ (ఎల్‌టీసీ) వోచర్ స్కీమ్‌పై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు...

LTC cash scheme: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం..ఆ స్కీమ్‌పై నో ట్యాక్స్ !
Follow us on

LTC cash scheme:  కేంద్ర ప్రభుత్వం ఉద్యగులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు. లీవ్ ట్రావెల్ కన్సిషన్ వోచర్ (ఎల్‌టీసీ) వోచర్ స్కీమ్‌పై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు. ఎల్‌టీసీ స్కీమ్ ఎంచుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు పన్ను మోత ఉండదు. ఎల్‌టీసీ స్కీమ్ కింద ఎంప్లాయిస్ ట్రావెల్ అలవెన్స్ కింద డబ్బులు పొందొచ్చు. దీనిపై ట్యాక్స్ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్‌ను గతేడాది అక్టోబర్ 12 అనౌన్స్ చేసింది.

కోవిడ్-19 వ్యాప్తి తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల కోసం ఉపశమన చర్యలు తీసుకోవాలనే టార్గెట్‌తో  కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు ప్రైవేట్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్‌టీసీ వోచర్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలని భావిస్తే కొన్ని రూల్స్ ఉంటాయి. 12 శాతం లేదా ఆపైన జీఎస్‌టీ వర్తించే ప్రొడక్ట్స్ ఉంటేనే ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే మార్చి 31 వరకే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు మాత్రమే జరపాలి. ట్రావెల్ అలవెన్స్‌కు మూడు రెట్లు ఖర్చు చేయాలి. ఎల్‌టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ కింద బెనిఫిట్ పొందాలంటే కచ్చితంగా జీఎస్‌టీ రశీదులు సబ్మిట్ చేయాలి. కాగా ఎంప్లాయిస్ చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు పెడతారని, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Also Read:

TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి ఆర్జిత సేవలకు గ్రీన్‌సిగ్నల్

Indrakeeladri: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం పునః ప్రారంభం.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి