Fire Broke: బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు పది ఫైరింజన్లను తీసుకువచ్చారు. వాటి సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాద స్థలికి సమీపంలో పెట్రోల్ బంక్ ఉంది. ఈ మంటలు పెట్రోల్ బంక్‌కు అంటుకుంటే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దాంతో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఈ అగ్ని ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read:
Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 214 కోవిడ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Suckermouth catfish: గోదావరిలో అడుగు పెట్టిన విదేశాల్లో ఎక్కువగా కనిపించే జీబ్రా గీతల ఎలుక మూతి చేప