PM Narendra Modi: పొరుగుదేశాలతో బలమైన మైత్రీ సంబంధాల కోసం ప్రత్యేక కృషిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన గౌరవం సాధించారు. పొరుగుదేశమైన భూటాన్ తమ దేశ అత్యున్న పౌర పురస్కారమైన నగదాగ్ పెల్‌గి ఖొర్లో(Ngadag Pel gi Khorlo)తో భారత ప్రధాని మోడీని గౌరవించనుంది. ఆ మేరకు ఈ అత్యున్నత పౌర పురస్కారానికి ప్రధాని మోడీని ఎంపిక చేసినట్లు భూటాన్ ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. భూటాన్ జాతీయ దినోత్సవం(డిసెంబరు 17) సందర్భంగా ఈ పౌర పురస్కారానికి ప్రధాని మోడీని ఎంపిక చేసినట్లు ఆ దేశ ప్రధాని లోటే షీరింగ్ (Lotay Tshering) శుక్రవారం సోషల్ మీడియాలో ప్రకటించారు. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ప్రధాని మోడీ ఎంపిక కావడం పట్ల సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.
చాలా ఏళ్లుగా.. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ప్రధాని మోడీ తమ దేశానికి అందించిన బేషరతు సాయాన్ని మర్చిపోలేమని భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. భూటాన్ ప్రజల తరఫున ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపింది. భారత ప్రధాని మోడీ ఆధ్యాత్మిక చింతన కలిగిన గొప్ప వ్యక్తిగా కొనియాడింది.
Overjoyed to hear His Majesty pronounce Your Excellency Modiji’s @narendramodi name for the highest civilian decoration, Order of the Druk Gyalpo.https://t.co/hD3mihCtSv@PMOIndia @Indiainbhutan pic.twitter.com/ru69MpDWlq
— PM Bhutan (@PMBhutan) December 17, 2021
భూటాన్ అత్యున్నత పౌర పురస్కారానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంపికైన సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read..
TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలపై వివాదం.. తక్కువ మందిని పాస్ చేశారని విద్యార్థుల ఆందోళన
Pushpa Movie : మలయాళంలో అల్లు అర్జున్ ‘పుష్ప’ దండయాత్ర కాస్త ఆలస్యం.. కారణం ఇదే..