హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ సంస్థ తమ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ధరను తగ్గించింది. దీన్ని రాష్ట్రాలకు 600 రూపాయలకు అమ్ముతుండగా ఇకపై తాజాగా డోసు 400 రూపాయలుగా నిర్ణయించింది. ఈ సమయంలో దేశం తీవ్రంగా కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దీనివల్ల ప్రజారోగ్యానికి తలెత్తిన పెనుసమస్యను , సవాలును గుర్తించి తామీ నిర్ణయం తీసుకున్నామని ఈ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ధరను నిర్ణయించడంలో పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రం డోసు 1200 రూపాయలుగానే ఉంది. పూణే లోని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను డోసు రాష్ట్రాలకు 300 రూపాయలుగా తగ్గిస్తూ ప్రకటన చేశారు. కానీ ప్రైవేటు హాస్పిటల్స్ కి 600 రూపాయలని, ఇది మారలేదని అన్నారు.వ్యాక్సిన్ ధరను తగ్గించే అవకాశాలను పరిశీలించాలని కేంద్రం ఈ రెండు సంస్థలనూ కోరడంతో ఇవి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా కేంద్రానికి తాము సబ్సిడీ ధరకు వ్యాక్సిన్ ఇస్తున్నామని, ఇది పరిమితఝ కాలానికి మాత్రమే ఉంటుందని ఆదార్ పూనావాలా వెల్లడించారు.
ఇలా ఉండగా భారత 617 వేరియంట్ ను కొవాగ్జిన్ నియంత్రించ గలదంటూ అమెరికా నిపుణుడు ఆంథోనీ ఫాసీ ఇటీవల ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ వైరాలజీ,, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో కలిసి భారత్ బయో టెక్ తమ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తోంది. అయితే దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకామందుల కొరత తీవ్రమవుతోంది. వీటి ఉత్పత్తిని పెంచాలని కేంద్రం ఇటీవల వీటిని కోరింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Tamil Nadu Kerala Puducherry Exit Poll Results 2021 LIVE: తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు