Viral Video: ‘అరెస్ట్ చేస్తే చచ్చిపోతా’.. పోలీసులకు చుక్కలు చూపించిన క్రిమినల్‌! వీడియో..

యేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అతడ్ని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ఫీట్లు చేయాల్సి వచ్చింది. దొంగ ఎత్తైన బిల్డింగ్‌ ఐదో అంతస్తు ఎడ్జ్‌ వరచు చేరుకుని.. నన్ను పట్టుకోడానికొస్తే ఇక్కడి నుంచి దూకేస్తానంటూ హల్‌చల్ చేశాడు. చివరకు పోలీసుల తెలివితేటల ముందు క్రిమినల్‌ మట్టిబుర్ర..

Viral Video: ‘అరెస్ట్ చేస్తే చచ్చిపోతా’.. పోలీసులకు చుక్కలు చూపించిన క్రిమినల్‌! వీడియో..
Criminal Dramatic Arrest In Gujarath

Updated on: Jun 08, 2025 | 12:51 PM

అహ్మదాబాద్‌, జూన్‌ 8: మోస్ట్‌ వాంటెండ్‌ క్రిమినల్‌ పోలీసుల నుంచి పారిపోయేందుకు నానాతిప్పలు పెట్టాడు. యేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అతడ్ని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ఫీట్లు చేయాల్సి వచ్చింది. దొంగ ఎత్తైన బిల్డింగ్‌ ఐదో అంతస్తు ఎడ్జ్‌ వరచు చేరుకుని.. నన్ను పట్టుకోడానికొస్తే ఇక్కడి నుంచి దూకేస్తానంటూ హల్‌చల్ చేశాడు. చివరకు పోలీసుల తెలివితేటల ముందు క్రిమినల్‌ మట్టిబుర్ర బోల్తాకొట్టింది. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే..

పలు కేసుల్లో వాంటెడ్ క్రిమినల్‌గా పేరమోసిన అభిషేక్ అలియాస్ షూటర్ ఎంతో కాలంగా పోలీసులకు దొరకకుండా చుక్కలు పూపించాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌కు శివమ్ ఆవాస్ లోని తన నివాసంలో అభిషేక్ ఉన్నట్లు సమాచారం అందింది. శనివారం క్రైమ్ బ్రాంచ్ అధికారులు వచ్చి తలుపు తట్టగా లోపలి నుండి గొళ్లెం పెట్టి, వంటగది కిటికీ గుండా పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాల్కనీ కింద ఉన్న అంచుపై నిలబడి, పోలీసులు దగ్గరికి వస్తే దూకేస్తానని బెదిరించాడు. ‘మీరు నాతో ఎలా ప్రవర్తిస్తావో నాకు తెలుసు. అది నిజంగా దారుణంగా ఉంటుంది. లొంగిపోవడం కంటే నేను చనిపోవడం మంచిది’ అనడంతో పోలీసులు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. చివరకు పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి, వలల సహాయంతో అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ హైడ్రామా స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. ఇందుకు సంబంధింఇన వీడియో క్లిప్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయ్యాయి.

ఇవి కూడా చదవండి

అరెస్టు తర్వాత క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజిత్ రజియాన్ మాట్లాడుతూ.. షూటర్ సంజయ్‌భ్ సింగ్ తోమర్ అలియస్‌ అభిషేక్.. అహ్మదాబాద్ తూర్పు జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన బహుళ నేరాలలో పాల్గొన్న వాంటెడ్ క్రిమినల్. అతను చాలా కాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. క్రైమ్ బ్రాంచ్‌ బృందాలు అతని కోసం చురుగ్గా గాలిస్తున్నాయి. ఈరోజు, అతను శివమ్ ఆవాస్‌లోని X వింగ్‌లోని ఫ్లాట్ నంబర్ 505లో ఉన్నట్లు సమాచారం అందింది. క్రైమ్ బ్రాంచ్‌ బృందాలు అతన్ని అరెస్ట్ చేసింది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.