Bangalore: ఏంటీ ఈ దారుణం.. ఓ మహిళను పార్కులో నుంచి బలవంతంగా లాక్కెళ్లి నలుగురు అత్యాచారం

|

Mar 31, 2023 | 2:55 PM

దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ వీటి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా బెంగళూరులోని ఓ మహిళను పార్కులో నుంచి బలవంతంగా తీసుకొచ్చి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Bangalore: ఏంటీ ఈ దారుణం.. ఓ మహిళను పార్కులో నుంచి బలవంతంగా లాక్కెళ్లి నలుగురు అత్యాచారం
Rape Case
Follow us on

దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ వీటి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా బెంగళూరులోని ఓ మహిళను పార్కులో నుంచి బలవంతంగా తీసుకొచ్చి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 25 వ తేదిన ఓ మహిళ కోరమంగళలోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్క్ కి తన స్నేహితురాలని కలవడానికి వచ్చింది. అక్కడే రాత్రివరకు చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి అర్ధరాత్రి అయ్యాక కూడా ఇంకా పార్క్ లోనే ఎందుకు ఉన్నారంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ మహిళ స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వాళ్లతో వాగ్వాదం పెట్టుకున్న వ్యక్తి..తన ముగ్గురు స్నేహితులకి ఫోన్ చేసి రప్పించాడు.

వాళ్లు ఆ పార్కులోకి రాగానే అక్కడ ఉన్న ఆ మహిళను బలవంతగా తమ కారులోకి లాక్కెల్లారు. కారులోనే వెళ్తుండగానే ఆమెపై ఆ నలుగురు అత్యాచారం చేశారు. చివరికి తెల్లవారు జామున ఆమె ఇంటి దగ్గర దిగబెట్టి అక్కడి నుంచి పారిపోయారు. అలాగే ఒకవేళ ఆమె ఈ విషయం పోలీసులుకు చెప్తే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయంటూ బెదిరించారు. కానీ ఆ మహిళ హాస్పిటల్ లో చికిత్స చేసుకున్న అనంతరం పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురు నిందులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ నిందితులను విచారిస్తున్నామంటూ సినీయర్ బెంగళూరు పోలీస్ అధికారి తెలిపారు.