Chicken Biryani: చికెన్‌ ముక్క లేకుండా చికెన్‌ బిర్యానీ వడ్డించిన హోటల్‌ సిబ్బంది.. కోర్టుకెక్కిన పంచాయితీ! ఆ తర్వాత ఏం జరిగిందంటే

|

Dec 05, 2023 | 3:36 PM

చికెన్ బిర్యానీ ఇష్టపడని వారుండరు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో రెస్టారెంట్లకు వెళ్లి బిర్యానీ లాగించేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి బిర్యానీ తినేందుకు రెస్టారెంట్‌కు వెళ్లే.. సదరు రెస్టారెంట్‌ సిబ్బంది చికెన్‌ లేకుండా చికెన్ బిర్యానీ వడ్డించారు. ఇందేంటని ప్రశ్నించిన కస్టమర్‌కు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్‌ కోర్టును ఆశ్రయించాడు. ఎక్కడ జరిగిందంటే..

Chicken Biryani: చికెన్‌ ముక్క లేకుండా చికెన్‌ బిర్యానీ వడ్డించిన హోటల్‌ సిబ్బంది.. కోర్టుకెక్కిన పంచాయితీ! ఆ తర్వాత ఏం జరిగిందంటే
Chicken Biryani
Follow us on

బెంగళూరు, డిసెంబర్‌ 5: చికెన్ బిర్యానీ ఇష్టపడని వారుండరు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో రెస్టారెంట్లకు వెళ్లి బిర్యానీ లాగించేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి బిర్యానీ తినేందుకు రెస్టారెంట్‌కు వెళ్లే.. సదరు రెస్టారెంట్‌ సిబ్బంది చికెన్‌ లేకుండా చికెన్ బిర్యానీ వడ్డించారు. ఇందేంటని ప్రశ్నించిన కస్టమర్‌కు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్‌ కోర్టును ఆశ్రయించాడు. ఎక్కడ జరిగిందంటే..

బెంగళూరులోని నాగరభావిలో నివాసముంటున్న కృష్ణప్ప ఇంట్లో ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన వంటగ్యాస్ అయిపోయింది. దీంతో కృష్ణప్ప దంపతులు ఐటీఐ లేఅవుట్‌లోని ప్రశాంత్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ 150 రూపాయలు చెల్లించి హోటల్‌లో చికెన్ బిర్యానీ పార్శిల్‌ ఆర్డర్‌ చేశారు. భార్యాభర్తలు ఇంటికి వచ్చి పార్శిల్ తెరిచి చూడగా బిర్యానీలో ఒక్క మాంసం ముక్క కూడా లేదు. వెంటనే కృష్ణప్ప హోటల్‌కి ఫోన్‌ చేసి.. తాను చికెన్‌ బిర్యానీకి డబ్బు చెల్లించానని, కానీ సాదా బిర్యానీ ఇచ్చారని తెలిపాడు. అప్పుడు హోటల్ యజమాని చికెన్ బిర్యానీ పార్శిల్ సిద్ధంగా ఉందని, 30 నిమిషాల్లో మీ ఇంటి చిరునామాకు పంపిస్తానని చెప్పాడు. రెండు గంటలు వేచి చూసినా చికెన్ బిర్యానీ రాలేదు. దీంతో కడుపు మండిన ఆ దంపతులు ఆ రాత్రికి తాము తెచ్చుకున్న సాదా బిర్యానీ తిని, పడుకున్నారు.

ఇవి కూడా చదవండి

తనను మోసం చేసిన హోటల్‌ యాజమన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కృష్ణప్ప హోటల్ యజమానికి ఏప్రిల్ 28న తెలియజేశాడు. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో కృష్ణప్ప మే నెలలో శాంతినగర్‌లోని బెంగళూరు సిటీ డిస్ట్రిక్ట్ కన్‌జ్యూమర్‌ కోర్టులో హోటల్ యజమానులపై ఫిర్యాదు చేశాడు. 30వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. తన కేసును కృష్ణప్ప స్వయంగా కోర్టులో వాదించుకున్నాడు. అయితే హోటల్ యజమాన్యం మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. కృష్ణప్ప వాదనలు విన్న కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి 2023 అక్టోబర్ 5న తీర్పు వెలువరించింది. తెలిసో తెలియకో హోటల్ తప్పు చేసిందని స్పష్టం చేసింది. కస్టమర్‌ నుంచి చికెన్ బిర్యానీకి 150 రూపాయలు తీసుకుని హోటల్ తప్పుడు పార్శిల్‌ని అందజేయడం అన్యాయమని అన్నారు. దీనిపై హోటల్ యామజన్యానికి తెలియజేసినా రీప్లేస్‌మెంట్ పార్శిల్ ఇవ్వకుండా కస్టమర్‌కు సేవ చేయడంలో హోటల్ విఫలమైందని న్యాయమూర్తి అన్నారు. నష్ట పరిహారం కింద రూ.1000తోపాటు, చికెన్‌ బిర్యానీకి అతను చెల్లించిన రూ.150 డబ్బును కస్టమర్‌కు తిరిగి చెల్లించాలని కన్‌జ్యూమర్‌ కోర్టు హోటల్ యజమానిని ఆదేశించింది.

No.1 న్యూస్‌ నెట్‌వర్క్‌.. No.1 ఎలక్షన్‌ కవరేజ్‌.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.