Bengaluru: భర్త దుబాయ్‌లో ఉన్నాడంటూ వలపు వల విసిరిన యువతి.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

|

Mar 21, 2023 | 7:53 PM

అందమే ఆమె ఆదాయ మార్గం. మాటలే ఆమె మంత్రదండం. పడిపోయారో అవతలి వాళ్ల జీవితం ఆగం. అవును, ధనవంతులే లక్ష్యంగా వలపు వల విసురుతూ,

Bengaluru: భర్త దుబాయ్‌లో ఉన్నాడంటూ వలపు వల విసిరిన యువతి.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
Honey Trap
Follow us on

అందమే ఆమె ఆదాయ మార్గం. మాటలే ఆమె మంత్రదండం. పడిపోయారో అవతలి వాళ్ల జీవితం ఆగం. అవును, ధనవంతులే లక్ష్యంగా వలపు వల విసురుతూ, అందినకాడికి దోచుకుంటున్న ఓ కిలాడీ, ఆమె గ్యాంగ్ అరాచకాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ కిలాడీ, ఆమె గ్యాంగ్ కోసం పుట్టేనహళ్లి పోలీసులు వేట సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూర్ నగరానికి చెందిన ఓ యువ పారిశ్రామికవేత్తను లక్ష్యంగా చేసుకుని ఓ యువతి వలపు వల విసిరింది. సోషల్ మీడియాలో అతనితో పరిచయం పెంచుకుంది. రోజూ యువకుడితో చాట్ చేస్తూ అతన్ని తన ముగ్గులోకి దించుకుంది. తనకు పెళ్లి అయ్యిందని, అయితే, తన భర్త దుబాయ్‌లో ఉంటాడంటూ నమ్మించింది. అయితే, తానిక్కడ విరహ వేదనతో ఒక్కదాన్నే ఉంటున్నానని యువకుడిని రెచ్చగొట్టింది. లైంగిక తృప్తి కోసం కలుద్దామంటూ ఊరించింది. ఇంకేముంది.. ఇటువైపు మనోడు రెచ్చిపోయాడు. అటువైపు చేప దొరికిందని భావించిన కిలాడీ.. తన వద్దకు రా అంటూ ఆమె అడ్రస్, లొకేషన్ షేర్ చేసింది.

ఇంకేముంది.. సదరు యువకుడు నేరుగా ఆమె పంపించిన లోకేషన్‌కు వెళ్లాడు. ఇద్దరూ ఆమె ఇంట్లో సరదాగా ఉన్నారు. ఇంతలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బయటి నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆమెతో కలిసి అతన్ని బెదిరించడం మొదలుపెట్టారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బెదిరించారు. లేదంటే.. పోలీసులకు కంప్లైంట్ ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. చివరకు బాధిత వ్యక్తి ఎలాగోలా వారి చెరనుంచి తప్పించుకున్నాడు. నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించి కంప్లైంట్ ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నిందితులంతా పరారీలో ఉండటంతో వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో పరిచయం అయిన వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..