Watch Video: ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారా?.. ఇక అంతే సంగతులు.. ఊహించని షాక్ ఇస్తున్న అధికారులు

Think twice before tossing that trash: ఇంటి బయట, కాలనీలో చెత్త పడేస్తున్నారా?.. అయితే అలా చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే.. మీరు బయట కొంచెం చెత్తను పడేస్తే.. మీ ఇంటి ముందు ట్రక్కు చెత్త పడుతుంది. దానితో పాటు రూ.2 నుంచి 10 వేల వరకు జరిమానా కూడా విధించబడుతుంది. అవును ఇది నిజం.. ఆ నగరంలోని చెత్త సమస్యకు చెక్‌ పెట్టేందుకు నగరపాలక అధికారులు ఈ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇంతకు ఆ నగరం ఏదనేగా మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.

Watch Video: ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారా?.. ఇక అంతే సంగతులు.. ఊహించని షాక్ ఇస్తున్న అధికారులు
Viral News (1)

Updated on: Oct 30, 2025 | 4:44 PM

ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా జనాలు నగర వీధుల్లో చెత్త వేయడం మానట్లేదు. దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA), బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (BSWML) అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. ఎవరైతే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తూ కనిపిస్తారో.. వారి ఇంటి ముందు ఒక ట్రక్‌ చెత్త వేయడం, రూ.2000 వేల నుంచి రూ.10,000 జరిమానా విధించాలని నిర్ణయించారు. దీని తక్షణమే అమల్లోకి కూడా తెచ్చారు.

ఈ చొరవలో భాగంగా, నగర మార్షల్స్ బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారవేస్తున్న వ్యక్తుల వీడియోలను రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత, వారి ఇళ్లను గుర్తించి, నేరుగా ట్రక్కుల కొద్దీ చెత్తను వారి ఇంటి ముందే పారవేస్తారు. అంతటితో ఆగకుండా.. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడే వారి వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేసి వారిని సిగ్గుపడేలా చేస్తారు. ఇలా చేయడం ద్వారా వారు మరోసారి చెత్తను బయటపడేసేందుకు ఆలోచిస్తారని అధికారులు చెబుతున్నారు

దీనిపై BSWML మేనేజింగ్ డైరెక్టర్ కరీ గౌడ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదని నగరంలో ఎన్ని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు తమకు నచ్చిన చోట చెత్తను వేస్తూనే ఉన్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టి..వారికి బలమైన సందేశాన్ని పంపడానికి మేము కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము అని ఆయన అన్నారు. బెంగళూరును శుభ్రంగా ఉంచాలనే ఆలోచనతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.