
మనం సరదా కోసం చేసే పనులు కొన్ని సార్లు క్షణాల్లో ప్రాణాతకంగా మారుతాయని చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఒక ఘటన బెస్ట్ ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే కారులో ప్రయాణించేప్పుడు సన్‌రూఫ్ నుంచి బయటకు రావడం కూడా ఎంత ప్రమాదమో తెలియజేస్తుంది. ఇంతకు విషయం ఏమిటంటే.. బెంగళూరుకు చెందిన ఒక బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో సిటీ అందాలును చూసేందుకు ఆ బాలుడు కారు సన్‌రూఫ్ ఓపెన్ బయటకు వచ్చాడు. ఇంతలో రోడ్డుపై ఏర్పాటు చేసిన హెవీ వెహికల్స్ కంట్రోల్ బారియర్ రావడంతో సడెన్‌గా దానికి తగిలి కారులో పడిపోయాడు.
ప్రమాదాన్ని గుర్తించిన ఇతర వాహనదారులు వాళ్ల కారును ఆపడంతో వెంటనే బాలుడిని హాస్పిటల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొత్తం వెనకాల వస్తున్న కార్లోని డ్యాష్ కామ్‌లో రికార్డయ్యాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెజిటన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
ఈ సంఘటన కారు వెళ్లేప్పుడు పిల్లల విషయంలో తల్లిదండ్రుల బాధ్యత, డ్రైవర్ అవగాహనపై తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రయాణించేప్పుడు ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కారు సన్‌రూప్‌లను ఎలాంటి అడ్డంకులు లేని హైవేలపై మాత్రమే వినియోగించాలని చెబుతున్నారు.
వీడియో చూడండి..
Next time when you leave your kids popping their heads out, think once again! pic.twitter.com/aiuHQ62XN1
— ThirdEye (@3rdEyeDude) September 7, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.