Fuel, Gas Price Hike: దేశంలో పెట్రో ధరలు పెరగడానికి కారణం తాలిబన్లే.. బీజేపీ ఎమ్మెల్యే..

BJP MLA on Fuel, Gas Price Hike: ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగాన్ని తాలిబాన్లు ఆక్రమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాలిబాన్ల అరాచకాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో

Fuel, Gas Price Hike: దేశంలో పెట్రో ధరలు పెరగడానికి కారణం తాలిబన్లే.. బీజేపీ ఎమ్మెల్యే..
Karnataka Bjp Mla Aravind Bellad

Updated on: Sep 04, 2021 | 9:28 PM

BJP MLA on Fuel, Gas Price Hike: ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగాన్ని తాలిబాన్లు ఆక్రమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాలిబాన్ల అరాచకాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో దేశంలో రాజకీయాలు కూడా తాలిబాన్ల ప్రస్తవనతోనే కొనసాగుతున్నాయి. పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శలు చేసుకునే సమయంలో తాలిబన్లతో పోల్చుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే మరింత ముందడుగు వేశారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలకు తాలిబాన్లే కారణమంటూ పేర్కొని వార్తల్లో నిలిచారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ఈ సంచలన వ్యాఖ్యలు చేసి.. ప్రస్తుతం పలువురి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కర్ణాటక హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ బల్లాడ్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో అరవింద్‌ మాట్లాడారు. ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల సంక్షోభం ముదురుతుంది. అందువల్ల ముడి చమురు సరఫరా తగ్గిపోయిందని పేర్కొన్నారు. దీని కారణంగా ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే.. ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునేంత జ్ఞానం, పరిపక్వత లేదంటూ బల్లాడ్‌ పేర్కొన్నారు. ఇదంతా తెలుసుకోకుండా.. కొంతమంది ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాగా.. అరవింద్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో, వార్తా ఛానెళ్లల్లో వైరల్‌గా మారాయి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల సంక్షోభం మొదలై నెల రోజులు అవుతుందని.. కానీ దేశంలో గత కొద్ది నెలలుగా.. ఇంధన ధరలు పెరుగుతున్నాయంటూ పేర్కొంటున్నారు. పెట్రో ధరలకు తాలిబన్లతో ముడిపెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనికి పైగా జనాలకు జ్ఞానం లేదంటూ ఎమ్మెల్యే బుద్ధిలేని వ్యాఖ్యలు చేశారంటూ పలు పార్టీల నేతలు, పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Also Read:

Viral Video: మాస్క్‌ పెట్టుకోలేదని ఫైన్‌ కట్టమంటే.. ఆ డ్రైవర్‌ చేసిన ఘనకార్యం చూడండి.. వీడియో వైరల్

Bihar MLA: ట్రైన్‌లో ఆ ఎమ్మెల్యే చేసిన గలీజు పనికి ప్రయాణికుల పరేషాన్‌.. ఏం చేశాడంటే..?