Ayodhya Ram Mandir: జై శ్రీరామ్.. అయోధ్య వైపు ప్రపంచం చూపు.. గర్భగుడిలో ప్రధాని మోదీ పూజలు

|

Jan 22, 2024 | 12:46 PM

అయోధ్య రామమందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదట ప్రత్యేక పూజలు చేశారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం.. తన అదృష్టమంటూ మోదీ పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠలో ప్రధాన యజమానిగా మోదీ పూజలు చేశారు. గర్భగుడిలో మోదీతోపాటు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌, సీఎం యోగి ఆదిత్యానాథ్ పలువురు ప్రత్యేక పూజలు చేశారు.

Ayodhya Ram Mandir: జై శ్రీరామ్.. అయోధ్య వైపు ప్రపంచం చూపు.. గర్భగుడిలో ప్రధాని మోదీ పూజలు
Ayodhya Ram Mandir
Follow us on

ఆహా.. ఇది ఎంత దివ్యమైన సమయం! అయోధ్యలో భవ్య మందిరంలో బాలరాముడు కొలువైన సందర్భం! ఇక ప్రది మదీ అయోధ్యే! ప్రతి మనసూ సరయూ తరమే! ‘THE RAMA RETURNS’ అంటూ..ప్రపంచమంతా రామనామ జపం చేస్తోంది. శ్రీరామ ప్రాణప్రతిష్ఠ అంటే..ధర్మ ప్రతిష్ఠే అని సనాతన సమాజం ఉప్పొంగిపోతోంది. ఐదువందల ఏళ్లుగా..ఎన్ని కష్టాలకోర్చారో..రామభక్తులు! పుట్టిన ఊరిలో రామయ్యకు గుడిలేదని ఎంత బాధపడ్డారో! కానీ ఇప్పుడు ఆ చింతలన్నీ తొలగిపోయాయి. కరసేవకుల తపస్సు ఫలించింది. అయోధ్యలో దివ్యంగా అలంకృతుడైన రామభద్రుడు భవ్యమందిరంలో కొలువయ్యాడు!! చూడండి..ఆ అయోధ్య ధామాన్ని..వచ్చేశాడు మన ప్రభు శ్రీముడు! అంటూ భక్తుల హృదయాలు పులకిస్తున్నాయి. నిజంగా..ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని తమ జీవితకాలంలో చూస్తున్నందుకు భక్తకోటి పులకిస్తోంది. ఈ అమృత పర్వంలో భాగమైనందుకు కోట్లాది సనాతన ప్రపంచం తమ జన్మధన్యమైందని పరవశిస్తోంది. జయజయ దశరథనందన అంటూ కీర్తిస్తోంది. దీంతో ప్రపంచం చూపు అయోధ్య వైపు నెలకొంది.

ఎక్కడ చూసినా.. రామ నామమే వినిపిస్తోంది. అయోధ్యకు మన రాముడొచ్చాడంటూ కీర్తిస్తోంది. అయోధ్య భవ్య మందిరంలో బాల రాముడు కొలువుదీరాడు. విశేష పూజల అనంతరం రాముడు దర్శనమిచ్చాడు.