నమ్మినవారే ముంచేశారు.. సొంత అకౌంట్లలోకి రాములోరి సొమ్ము.. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజీనామా..!

హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్య రామమందిరంలో విరాళాలు, భక్తులు సమర్పించిన కానుకల దొంగతనం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘోర అపచారంపై వెలువడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదిక నేపథ్యంలో కేసు ఊపందుకుంది. ఈ ఆరోపణల ముసుగులో తీవ్ర ఒత్తిడి రావడంతో, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు నైతిక కారణాలతో రాజీనామా సమర్పించారు.

నమ్మినవారే ముంచేశారు.. సొంత అకౌంట్లలోకి రాములోరి సొమ్ము.. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజీనామా..!
Ram Janmabhoomi Teerth Kshetra Trust Champat Rai

Updated on: Jun 26, 2026 | 4:12 PM

హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్య రామమందిరంలో విరాళాలు, భక్తులు సమర్పించిన కానుకల దొంగతనం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘోర అపచారంపై వెలువడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నివేదిక నేపథ్యంలో కేసు ఊపందుకుంది. ఈ ఆరోపణల ముసుగులో తీవ్ర ఒత్తిడి రావడంతో, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు నైతిక కారణాలతో రాజీనామా సమర్పించారు.

రహస్య కెమెరాలతో దొంగల గుట్టురట్టు!

మే నెల చివరి వారంలో విరాళాల పెట్టెలను ఖాళీ చేయడం, బ్యాంకు డిపాజిట్లను సమీక్షించిన ట్రస్ట్ అధికారులకు మొదటిసారిగా దొంగతనంపై అనుమానం వచ్చింది. సాధారణంగా ఒక్కో పెట్టెలో ఉండే 7 నుండి 8 లక్షల రూపాయలలో, 500 రూపాయల నోట్ల కట్టల సంఖ్య కొన్ని వారాలుగా తగ్గుతూ వచ్చింది. దీంతో అధికారులు నోట్ల లెక్కింపు గదిలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక వారం పాటు సేకరించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, నోట్లు లెక్కించే కొందరు ఉద్యోగులు కెమెరాలకు అడ్డంగా నిలబడగా, మరో సహచరుడు నోట్ల కట్టల నుండి డబ్బును దొంగిలించి తన దుస్తులలో దాచుకోవడం స్పష్టంగా రికార్డ్ అయింది. నిందితులు విరాళాల పెట్టెల్లో దొరికిన నోట్లను లెక్కించడానికి, నగలను రిజిస్టర్లలో నమోదు చేయడానికి ముందే దొంగతనానికి పాల్పడేవారని తేలింది.

రెండు పద్ధతుల్లో పక్కా స్కెచ్‌తో దోపిడీ!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ముఠా రెండు రకాలుగా మోసానికి పాల్పడింది. నోట్ల లెక్కింపు సిబ్బంది ప్రతి కట్టకు అదనపు నోట్లను జతచేసేవారు. బ్యాంకులో జమ చేయడానికి డబ్బును గుడి నుండి తీసుకువెళ్ళినప్పుడు, ఆ కట్టలలోని అదనపు నోట్లను విడిగా తీసేసి, కేవలం కట్టల సంఖ్యను మాత్రమే లెక్కించి తప్పుడు వోచర్లు సృష్టించేవారు. ఈ మోసంలో అనుకల్ప్ మిశ్రా పాత్ర ఉండగా, అతని బావమరిది లవ్‌కుష్ మిశ్రా ద్వారా ఈ నెట్‌వర్క్ నడిచింది. పోలీసులు లవ్‌కుష్ మిశ్రా ఇల్లు సోదా చేయగా సుమారు రూ. 10 లక్షల నగదు పట్టుబడింది. నిందితులలో ఒకడైన అవినాష్ పాండే దొంగిలించిన విరాళాల సొమ్మును అదే రోజు తన సొంత బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాక, భక్తులు రామ్ లల్లాకు సమర్పించిన చెవిపోగులు, ఝుంకీలు, ముక్కుపుడకలు, కంకణాలు, కాలి గజ్జెలు వంటి బంగారు, వెండి ఆభరణాలను కూడా ఈ ముఠా దొంగిలించింది.

సిఫార్సులతో చేరి.. తనిఖీల్లేక దోచేశారు!

ఈ నోట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులందరూ ట్రస్ట్‌లోని కీలక వ్యక్తుల సిఫార్సులతో చేరినవారే. చంపత్ రాయ్ డ్రైవర్ రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిను యాదవ్ మేనేజర్‌గా వ్యవహరిస్తూ, తన కజిన్ మనీష్ యాదవ్‌ను ఈ పనిలో పెట్టాడు. విధి నిర్వహణ ముగించుకుని వెళ్లేటప్పుడు ఉద్యోగులను సరైన రీతిలో తనిఖీ చేయకపోవడమే ఈ భారీ చోరీకి కారణమైంది. రోజుకు సుమారు రూ. 6 నుండి 7 లక్షల రూపాయల వరకు దొంగతనం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం.. 8 మంది అరెస్ట్!

ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. “అయోధ్య హిందూ విశ్వాసానికి ప్రతీక, ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి ద్రోహులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం” అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మొహర్రం సెలవు దినం కావడంతో, నిందితులను రిమాండ్ నిమిత్తం డ్యూటీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us