
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకీ తూటాలు మోగాయి. గరియాబంద్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు పది మంది మృతి చెందిఉండవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గరియాబంద్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని.. ఎన్‌కౌంటర్‌లో కొందరు మావోయిస్టులు చనిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్న ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలోని ఐఈడీ పేలి ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. మందుపాతరలను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ సమయంలో ఈ పేలుడు సంభవించినట్టు దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ తెలిపారు. గాయపడిన ఇద్దరు జవాన్లలో ఒక ఇన్‌స్పెక్టర్ కూడా ఇన్నటు ఆయన పేర్కొన్నారు. గాయపడిన ఇద్దరు ప్రతస్తుం దంతేవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. మెరుగైన వైద్య సంరక్షణ కోసం వారిని రాయ్‌పూర్‌కు హెలికాప్టర్ ద్వారా తరలించనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.