అస్సాంలో మదర్సాలు , సంస్కృత స్కూళ్ల మూసివేతకు నిర్ణయం

| Edited By: Pardhasaradhi Peri

Oct 11, 2020 | 12:19 PM

అస్సాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని మదర్సాలు, సంస్కృత స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ, ఆర్థిక శాఖ మంత్రి కూడా అయిన హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. మత పరమైన బోధనలు చేసే ఈ విధమైన సంస్థలు ప్రభుత్వానికి ‘గుదిబండలు’గా మారాయని, ప్రభుత్వ నిధులతో వీటిని నిర్వహించచజాలమని ఆయన చెప్పారు. అయితే ప్రైవేటుగా నడిచే ఈ విధమైన సంస్థల విషయంలో తాము చెప్పేదేమీ లేదని ఆయన అన్నారు . మదర్శాలు, సంస్కృత స్కూళ్ల మూసివేత విషయంలో ఒక […]

అస్సాంలో మదర్సాలు , సంస్కృత స్కూళ్ల మూసివేతకు నిర్ణయం
Follow us on

అస్సాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని మదర్సాలు, సంస్కృత స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ, ఆర్థిక శాఖ మంత్రి కూడా అయిన హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. మత పరమైన బోధనలు చేసే ఈ విధమైన సంస్థలు ప్రభుత్వానికి ‘గుదిబండలు’గా మారాయని, ప్రభుత్వ నిధులతో వీటిని నిర్వహించచజాలమని ఆయన చెప్పారు. అయితే ప్రైవేటుగా నడిచే ఈ విధమైన సంస్థల విషయంలో తాము చెప్పేదేమీ లేదని ఆయన అన్నారు . మదర్శాలు, సంస్కృత స్కూళ్ల మూసివేత విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి.