Ashwini Vaishnaw: మేక్ ఇన్ ఇండియాలో భాగం కానున్న ఫ్లెక్స్ కంపెనీ.. కేంద్రమంత్రితో భేటీ అయిన సీఈఓ..

|

Jan 17, 2024 | 9:38 PM

ఈ క్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతితో భేటీ అయ్యారు. ఫ్లెక్స్ లిమిటెడ్ 'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉందని.. ఫ్లెక్స్ సీఈవో శ్రీమతి రేవతి అద్వైతితో మంచి చర్చ జరిగిందంటూ అశ్విని వైష్ణవ్ .. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో షేర్ చేశారు.

Ashwini Vaishnaw: మేక్ ఇన్ ఇండియాలో భాగం కానున్న ఫ్లెక్స్ కంపెనీ.. కేంద్రమంత్రితో భేటీ అయిన సీఈఓ..
Revathi Advaithi - Ashwini Vaishnaw
Follow us on

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 28,000 మందికి పైగా నాయకులు పాల్గొంటున్నారు. స్విట్జర్లాండ్‌లోని ఆల్పైన్ రిసార్ట్ ఐదు రోజుల టాకాథాన్‌లో దాదాపు 60 దేశాల ప్రతినిధులు పాల్గొని.. పెట్టుబడుల కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ సదస్సులో భౌగోళిక రాజకీయాలు, వ్యాపారం, సంస్కృతి, ప్రపంచ సమాజానికి సంబంధించిన సమస్యలపై ప్రపంచ నాయకులు చర్చిస్తున్నారు. అయితే, భారత్ లో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు WEFలో భారతదేశం తరపున కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు కంపెనీల సీఈఓలతో, ప్రతినిధులతో, ప్రపంచ నాయకులతో అశ్విని వైష్ణవ్ సమావేశమవుతున్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేలా పలు కంపెనీలను ఆకర్షిస్తున్నారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతితో భేటీ అయ్యారు. ఫ్లెక్స్ లిమిటెడ్ ‘మేక్ ఇన్ ఇండియా’కు కట్టుబడి ఉందని.. ఫ్లెక్స్ సీఈవో శ్రీమతి రేవతి అద్వైతితో మంచి చర్చ జరిగిందంటూ అశ్విని వైష్ణవ్ .. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో షేర్ చేశారు.

అశ్విని వైష్ణవ్ ట్విట్..

Flex Ltd అమెరికాకు చెందిన బహుళజాతి విభిన్న తయారీ సంస్థ. ఇది మూడవ అతిపెద్ద ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలను అందిస్తోంది. ఫ్లెక్స్ లిమిటెడ్ కంపెనీకి భారతీయ సంతతికి చెందిన అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ రేవతి అద్వైతి సీఈఓ 2029లో నియమితులయ్యారు. 2019లో ఫ్లెక్స్‌లో చేరడానికి ముందు, అద్వైతి ఈటన్ మరియు హనీవెల్‌లో వివిధ నాయకత్వ స్థానాల్లో పనిచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..