Viral Picture: దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో ఆయన చాలా డిఫెరెంట్.. ప్రత్యర్థులపై ఆరోపణలు ఉండవు.. విమర్శలకు అసలే దిగరు.. ప్రజలపై వరాల జల్లు కురిపించరు.. అయినా ఆయనంటే.. జనాలకు నమ్మకం ఎక్కువ. ఆయన పార్టీ పోటీ చేస్తే.. ప్రధాన పార్టీల్లో ప్రకంపనలు మొదలవుతాయి. ఇప్పుడు ఆ సీఎం గురించి కశ్మీర్.. నుంచి కన్యాకుమారి వరకు చర్చ నడుస్తోంది. ఢిల్లీలోనే అధికారానికి పరిమితమైన ఆయన పార్టీ.. ఇప్పుడు పంజాబ్‌లో సైతం పాలనను కైవసం చేసుకుంది. ఆయన ఎవరో కాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఆయన దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. దీంతోపాటు ఢిల్లీ సీఎంగా రెండోసారి కొనసాగుతూ.. ఇప్పుడు ఆయన పార్టీని పంజాబ్‌లో గెలిపించారు. అయితే.. అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన త్రోబ్యాక్ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు హోలీ జరుపుకుంటున్న త్రోబ్యాక్ ఫోటో ట్విట్టర్‌లో వైరల్ అవుతుంది. ఈ ఫొటో 1986లో తీసిన ఫొటో. ఈ ఫొటోను అతని బ్యాచ్‌మేట్ రాజీవ్ సరాఫ్ ట్విట్టర్‌లో షేర్ చేసి దీనిలో సీఎం ఉన్నారు.. గుర్తుపడతారా..? అంటూ రాశారు.
చిత్రంలో సీఎం కేజ్రీవాల్ హోలీ సందర్భంగా విద్యార్థులతో కలిసి సంబరాలు చేసుకుంటూ కనిపించారు. అయితే.. ఈ పజిల్ ముఖ్యమంత్రి స్వయంగా స్పందించకుండా ఉంటే.. ఆయన్ను గుర్తు పట్టడం చాలా కష్టం అయ్యేది. ఈ చిత్రం గురించి కేజ్రీవాల్‌ను ఒక విలేకరి ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి కేజ్రీవార్ స్పందించారు. బ్రౌన్ ట్రౌజర్‌లు ధరించి ముందున్న వ్యక్తిని తానేనంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఫోటోలో మధ్యలో బ్రౌన్ ప్యాంటు, హాఫ్ సెల్ఫ్ షర్ట్ ధరించి ఉన్న వ్యక్తి కేజ్రీవాల్.. అని అప్పుడు అర్ధమైంది. ఆతర్వాత నెటిజన్లు ఫొటోపై పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. కేజ్రీవాల్ స్మార్ట్‌గా ఉన్నారని.. గుర్తు పట్టలేకపోతున్నామని పేర్కొంటున్నారు.
IIT-ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అయిన కేజ్రీవాల్ 1989లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసారు. ఆ తర్వాత 1993లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 2015 నుంచి ఢిల్లీకి ముఖ్యమంత్రికి కొనసాగుతున్నారు. క్రియాశీల రాజకీయాల్లో రావడానికి ముందు కేజ్రీవాల్ న్యూఢిల్లీలో ఆదాయపు పన్ను జాయింట్ కమిషనర్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో పనిచేశారు.
The one in the front wid brown trousers… https://t.co/KVsd6M5Cff
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 21, 2019
అయితే.. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గౌరవసూచకంగా హోలీ జరుపుకోకూడదని నిర్ణయించుకున్న రాజకీయ నాయకుల్లో కేజ్రీవాల్ ఒకరిగా నిలిచారు.
Also Read: