ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల విలువ రూ. 3.4 కోట్లని తేలింది. 2015 లో ఇవి రూ. 2.1 కోట్లు కాగా.. ఆ తరువాత రూ. 1.3 కోట్లు పెరిగాయట. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన తన అఫిడవిట్ లో ఆయన ఈ విషయాలను వివరించారు. ఇక తన భార్య సునీత ఆస్తుల విలువ 2015 లో 15 లక్షలు ఉండగా.. ఈ సంవత్సరానికి అది రూ. 57 లక్షలకు పెరిగినట్టు ఆయన తెలిపారు. ఇందులో 32 లక్షల నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు వెల్లడించారు. మాజీ ఆప్ నేత, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఆస్తుల విలువ రూ. 2.8 కోట్లట. కాగా ఈ ఈ ఎన్నికల్లో అత్యంత ధనికుడైన ఆప్ నాయకుడు ధరమ్ పాల్ లక్రా.. తన ఆస్తుల విలువ రూ. 292 కోట్లని పేర్కొన్నారు. ఆయన తరువాత ప్రమీలా టోకస్ ఆస్తులు రూ. 80 కోట్లు, ధన్వతి చందెలా ఆస్తులు రూ. 55 కోట్లు, రాజ్ కుమారి ధిల్లాన్ ఆస్తులు రూ. 51 కోట్లని వెల్లడైంది. వీరంతా ఆప్ కు చెందిన అభ్యర్థులే.. మొత్తానికి ఈ పార్టీకి చెందిన క్యాండిడేట్స్ లో కేజ్రీవాల్ ఆస్తులే తక్కువన్న విషయం స్పష్టమవుతోంది.