రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. జవాన్‌ వీరమరణం

పాక్ మళ్లీ కవ్వింపులకు పాల్పడుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దుల వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడుతోంది. తాజాగా శనివారం నాడు రాజౌరీ సెక్టార్‌ మీదుగా..

రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. జవాన్‌ వీరమరణం

Updated on: Aug 01, 2020 | 4:26 PM

పాక్ మళ్లీ కవ్వింపులకు పాల్పడుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దుల వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడుతోంది. తాజాగా శనివారం నాడు రాజౌరీ సెక్టార్‌ మీదుగా కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఓ జవాన్ తీవ్రంగా గాయపడి.. ప్రాణాలు కోల్పోయాడు. పాక్ జరిపిన కాల్పుల్లో రోహిన్ కుమార్ అనే ఓ సాపియి తీవ్ర గాయాలపాలయ్యాడని.. ఆ తర్వాత అమరుడయ్యాడని ఆర్మీ అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌ ఆర్మీ సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులు చేపట్టిందని.. ఈ క్రమంలో భారత ఆర్మీ కూడా పాక్‌కు ధీటుగా ఎదురు కాల్పులు చేపడుతోందని తెలిపారు. కాగా, పాక్ కాల్పుల్లో అమరుడైన సిపాయి రోహిన్‌ కుమార్‌కు నివాళులు అర్పించింది భారత ఆర్మీ.

Read More

ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

Loading...
Unable to load recommendations.
Follow Us