రోజురోజుకూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం తగ్గడం లేదు. సైబర్ నేరస్తులు రోజుకో కొత్త తరహాలో మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే అనుమానాస్పద వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు, కేఫ్ లు, హోటళ్లు, బస్టాండ్లు వంటి తరచూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు జనాలను హెచ్చరిస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ పోర్టులపై ఆధారపడే వ్యక్తులను దోపిడీ చేయడానికి సైబర్ నేరగాళ్లు “యుఎస్బి ఛార్జర్ స్కామ్” మాల్వేర్ ను వాడుతున్నట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. అయితే దీనినే “జ్యూస్-జాకింగ్” అని అంటారు. హ్యాకర్లు వ్యక్తిగత డేటాను రహస్యంగా దొంగిలించడానికి లేదా అనుమానాస్పద వినియోగదారుల పరికరాలలో సాఫ్ట్ వేర్ ను అనుమతిస్తుంది. అయితే చాలామంది తెలియకుండా తమ ఫొన్లను, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్లను కనెక్ట్ చేసినప్పుడు తెలియకుండానే వ్యక్తిగత సమాచారం అవతలివాళ్లకు చేరుతుంది.
ఇటువంటి మోసాలపై అధికారులు అవగాహన కల్పిస్తూ సంబంధిత అధికారులు సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో యుఎస్బి స్టేషన్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి స్వంత ఛార్జింగ్ కేబుల్స్ లేదా పవర్ బ్యాంకులను తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. గతంలో నేరస్తులు ఇలాంటి కొత్త రకం మోసాల ద్వారా పలువురి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈజీ మనీకి అలవాటు పడిన సైబర్ నేరగాళ్లకు రోజుకో కొత్త తరహాలో మోాసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ, డెలివరీ అంటూ పలు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలో ఎన్నో వెలుగుచూశాయి. అయితే సైబర్ క్రైమ్ అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతుండటంతో కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. సో మీరు బయటకు వెళ్లేటప్పుడు సొంత చార్జర్లను తీసుకెళ్లడం మరిచిపోవద్దు. బీ అలర్ట్.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.