
Ashwini Vaishnaw on Apple Hacking Alert Row: దేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఏ మాత్రం హ్యాకింగ్‌కు ఆస్కారం లేని ఆపిల్ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయంటూ సాక్షాత్తూ ఆపిల్ సంస్థే చెప్పడంతో కలకలం రేగింది. విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీని కాపాడడం కోసమే కేంద్రం ట్యాపింగ్ చేస్తోందని, ఆపిల్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వంలో నెంబర్‌వన్ అదానీ మారిపోయారని మండిపడ్డారు రాహుల్. అదానీ ఆదేశాలను ప్రధాని మోదీ, అమిత్‌షా పాటిస్తున్నారని ఆరోపించారు. ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ అసదుద్దీన్ ఒవైసీ, కేసీ వేణుగోపాల్, మహువా మొయిత్రా, శశి థరూర్, సీతారాం ఏచూరి, రాఘవ్ చడ్డాకు ఆపిల్ నుంచి ఈమెయిల్ వచ్చింది. ఈ మెయిల్స్‌ను స్క్రీన్‌షాట్లుగా పెట్టి ఎంపీలు ట్వీట్ చేశారు. కేంద్రం తమపై నిఘా పెట్టిందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. మరోవైపు పలువురు జర్నలిస్టులకు కూడా మీ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదముందని ఆపిల్ నుంచి ఈమెయిల్ వచ్చింది. అయితే ఈ ఇష్యూపై యాపిల్ సంస్థ స్పందించింది. అలర్ట్ మెసేజ్ ఏ దేశాన్ని ఉద్దేశించి పంపలేదని.. 150కి పైగా దేశాల్లో తమ వినియోగదారులకు థ్రెట్ నోటిఫికేషన్లు పంపినట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది.
కాగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. తమ ఐఫోన్‌లను హ్యాక్ చేసే అవకాశం ఉందని టెక్ దిగ్గజం యాపిల్ నుంచి పలువురు పార్లమెంట్ సభ్యులకు అందిన హెచ్చరికలపై కేంద్రం విచారణకు ఆదేశించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని.. ఈ సమస్యపై ఆపిల్ సమాచారం అస్పష్టంగా ఉందని పేర్కొన్నారు.
దీంతో పాటు అశ్విని వైష్ణవ్ ట్విట్ కూడా చేశారు. ‘‘Apple నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి కొంతమంది ఎంపీలు, ఇతరుల నుంచి మేము మీడియాలో చూసిన ప్రకటనల గురించి మేము ఆందోళన చెందుతున్నాము. మీడియా నివేదికల ప్రకారం వారు అందుకున్న నోటిఫికేషన్‌లో వారి పరికరాలపై దేశ ప్రాయోజిత దాడుల గురించి ప్రస్తావించారు.. ఈ సమస్యపై Apple అందించిన సమాచారం అస్పష్టంగా ఉంది.. నిర్దిష్టంగా లేదు. అసంపూర్ణమైన సమాచారం ఆధారంగా ఈ నోటిఫికేషన్‌లు ఉండవచ్చని Apple పేర్కొంది. కొన్ని Apple థ్రెట్ నోటిఫికేషన్‌లు తప్పుడు అలారాలు లేదా కొన్ని దాడులు గుర్తించలేమని కూడా పేర్కొంది. Apple IDలు పరికరాలలో సురక్షితంగా ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని, వినియోగదారు స్పష్టమైన అనుమతి లేకుండా వాటిని యాక్సెస్ చేయడం లేదా గుర్తించడం చాలా కష్టమని Apple పేర్కొంది. ఈ ఎన్‌క్రిప్షన్ యూజర్ Apple IDని రక్షిస్తుంది. అది ప్రైవేట్‌గా.. సురక్షితంగా ఉండేలా నిర్ధారిస్తుంది. భారత ప్రభుత్వం పౌరులందరి గోప్యత, భద్రతను రక్షించడంలో తన పాత్రను చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ నోటిఫికేషన్‌ల ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. అటువంటి సమాచారం, విస్తృతమైన ఊహాగానాల దృష్ట్యా, రాష్ట్ర ప్రాయోజిత దాడులపై నిజమైన, ఖచ్చితమైన సమాచారంతో విచారణలో భాగస్వామ్యం కావాలని మేము Appleని కూడా కోరాము’’. అంటూ అంటూ కేంద్రమంత్రి ట్విట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..